గాడిదలాంటి చారలున్నా.. లక్షణాలు మాత్రం జిరాఫీవే! - Mbuti
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9011646-thumbnail-3x2-okapi.jpg)
సాధారణంగా ఏ జంతువైనా ఒకే జాతి లక్షణాలతో ఉంటుంది. కానీ ఆఫ్రికాలోని కాంగో అడవుల్లో కనిపించే 'ఒకాపీ' మాత్రం విభిన్నం. ఎందుకంటే ఇది జిరాఫీ, గాడిదల కలయికతో పుట్టే ఓ అరుదైన జాతి దూడ. ప్రస్తుతం ఇది లండన్ జంతు ప్రదర్శనశాలలో కనివిందు చేస్తోంది. 'ఒకాపీ' జీబ్రావలె చారలతో పాటు పొడవాటి మెడతో జిరాఫీ లక్షణాలూ కలిగి ఉంటుంది. 16 నెలల గర్భం తర్వాత తల్లి 'ఓని' దీనికి జన్మనిచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. సరైన ఆవాసాలు లేకపోవడం, వేటగాళ్ల ముప్పు పొంచి ఉన్నందున ప్రస్తుతం ఒకాపీ జాతి అంతరించిపోతోంది.