Joe Biden: రోడ్డు పక్కన ఐస్క్రీం కొన్న అమెరికా అధ్యక్షుడు - రోడ్డు పక్కన ఐస్క్రీం కొన్న బైడెన్
🎬 Watch Now: Feature Video
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden).. రోడ్డు పక్కన ఉన్న ఓ స్టోర్లో ఐస్క్రీం కొని.. అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్లీవ్ల్యాండ్లోని ఓ కాలేజీలో ప్రసంగం ముగిసిన అనంతరం శ్వేతసౌధానికి బయలు దేరిన బైడెన్(Joe Biden).. మార్గమధ్యలో హనీ హట్ అనే ఐస్క్రీం స్టోర్ ముందు ఆగారు. చాకోలెట్ చిప్ ఐస్క్రీంను ఆర్డర్ చేశారు. అంతేకాకుండా పక్కన ఉన్న ఓ యువతికి ఏం ఐస్క్రీం తింటారో అడిగి.. ఆమెకు కూడా ఆర్డర్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మద్దతుదారులతో సంభాషించారు బైడెన్(Joe Biden).