కరోనా ఆంక్షలపై నిరసనలు హింసాత్మకం- నగరం లూటీ! - ఫ్రాన్స్ కరోనా ఆంక్షలు
🎬 Watch Now: Feature Video
కొవిడ్-19 ఆంక్షలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్(france lockdown news 2021) గ్వాడెలోప్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ద్వీపంలోని అతిపెద్ద పట్టణం 'పాయింట్-ఏ-పిట్రే'లో జరిగిన ఘర్షణల్లో 80ఏళ్ల వృద్ధురాలు సహా.. ముగ్గురు గాయపడ్డారు. అనేక ఇళ్లను అల్లర మూకలు లూటీ చేశాయి. ఈ ఘటనలో 38మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్‌లో అంతర్భాగం అయిన ఈ ద్వీపం గత మూడు రోజులుగా కొవిడ్ నిబంధనల(france coronavirus news) వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతోంది. వీటిని అణచివేసేందుకు ప్రత్యేక బలగాలను మోహరించింది ప్రభుత్వం.