చల్లని మంచు.. మెల్లగా వచ్చి రహదారిని ముంచేసింది! - flowing sచల్లని మంచు.. మెల్లగా వచ్చి రహదారిని ముంచేసింది!now snow
🎬 Watch Now: Feature Video

పశ్చిమ అమెరికాలోని ఉటా దేశంలో ఓ భీకర ప్రకృతి ప్రళయం కెమెరాకు చిక్కింది. భారీ మంచు అల దూసుకొచ్చి ఒక్కసారిగా కాన్సోన్స్ రహదారిని కప్పేసిన దృశ్యం చిన్నపాటి సునామీని తలపించింది. హిమ ప్రవాహం కారణంగా ఆ రహదారిపై దాదాపు 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఉటా రవాణా శాఖ అధికారులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, ఈ మార్గంలో ప్రయాణించేవారికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఏటా శీతాకాలంలో కనిపించే ఇలాంటి ప్రమాదకర హిమ తాండవాలు ఇక్కడివారికి కొత్తేమీ కాదు.