చిన్నారుల బస్సును హైజాక్ చేసిన ఆర్మీ ట్రైనీ - చిన్నారుల బస్సును హైజాక్ చేసిన ఆర్మీ ట్రైనీ
🎬 Watch Now: Feature Video
అమెరికా కొలంబియాలో ఓ ఆర్మీ ట్రైనీ.. చిన్నపిల్లల బస్సును హైజాక్ చేశాడు. డైవర్‌ను తుపాకీతో బెదిరించి బస్సు ఎక్కాడు. మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించినట్లు కొలంబియా పోలీస్ అధికారి లియోన్ లాట్ తెలిపారు. కొద్ది దూరం వెళ్లాక.. పిల్లలను, డ్రైవర్‌ను దింపేసి బస్సుతో పరారైనట్లు వివరించారు. కొద్దిసేపటికే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఘటనా సమయంలో బస్సులో 18 మంది పిల్లలున్నారని పేర్కొన్నారు.