సర్వ భూపాల వాహనంపై కనువిందు చేసిన శ్రీవారు - తిరుమల బ్రహ్మోత్సవాలు
🎬 Watch Now: Feature Video
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాల్గోరోజు ఉత్సవాల్లో భాగంగా.... సర్వభూపాల వాహనంపై స్వామివారు ఆశీనులయ్యారు. కల్యాణ మండపంలో కొలువుదీర్చిన సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు... బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. దివ్యప్రబంధ పారాయణం, వేదపారాయణం చేస్తున్న సమయంలో అర్చకులు స్వామివారికి హారతులు, నైవేద్యాలను సమర్పించారు. జీయంగార్లు సాత్తుమొర నిర్వహించిన అనంతరం... రంగనాయకుల మండపంలో ఆస్థానంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.