Murder CC Footage: బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు! - BTech student Ramya murder news
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య దృశ్యాలు సీసీ పుటేజీలో లభ్యమయ్యాయి. పెదకాకాని రోడ్డులోని పరమాయకుంట వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో పొడుస్తున్న దృశ్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడే చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కల్గించింది. రమ్య గొంతు, పొట్ట, పొత్తికడుపులో మొత్తం 6 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర రక్తస్రావమైన ఆమెను జీజీహెచ్‌కు తీసుకువెళ్లేలోగానే మృతి చెందింది. ఘటన తర్వాత ఉన్మాది వేరే మార్గంలో ఉన్న ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు.