PRATHIDWANI: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతారా? - ప్రతిధ్వని వీడియోలు
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో రైతులు వరిపంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఉప్పుడు బియ్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ విధానం మారిందని, ఈ కారణంగా దొడ్డు వడ్లు పండించొద్దంటూ రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో వర్షాకాలం, యాసంగి సీజన్లలో వరి పంట భారీగా సాగవుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఉప్పుడు బియ్యం కోసం సేకరించే దొడ్డు వడ్లే. ఈ ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నందు వల్ల అదనంగా వరి ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయొద్దంటూ రైతులను కోరుతోంది. ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. అయితే... ఇంత తక్కువ వ్యవధిలో రైతులు ఇతర పంటలకు మారుతారా? ప్రత్యామ్నాయ పంటలు రైతులకు గిట్టుబాటు అవుతాయా? వరి అధికంగా పండించే ఇతర రాష్ట్రాలపై లేని ఆంక్షలు తెలంగాణ వరిపైనే ఎందుకు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ.