prathidwani: అన్నదాతలను ఆదుకునే మార్గాలు ఏంటి? - prathidwani on farmers problems
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13018896-12-13018896-1631198495621.jpg)
ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు రైతులకు తీరని కడగండ్లు మిగిల్చాయి. లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది. అప్పోసప్పూ చేసి పంటలు వేసిన రైతన్నల ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇంతకాలం రెక్కలు ముక్కలు చేసుకున్న రైతుల కష్టమంతా వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ కష్టకాలంలో అన్నదాతను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర బీమా పథకాలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే మార్గాలు ఏంటి? అన్నదాతలకు తక్షణం ఎలాంటి సహాయం అందించాలి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.