పెంచుకుంటున్న శునకాన్నే కత్తితో నరికి..! - గృహ హింస
🎬 Watch Now: Feature Video
కొందరు మనుషుల్లో పైశాచికత్వం పెరిగి మానవత్వం మంటగలుస్తుందనడానికి ఉదాహరణ ఇది. తాను పెంచుకుంటున్న శునకం నిద్రిస్తుండగా.. కత్తితో నరికేశాడో ఉన్మాది. పాపం.. ఆ శునకం రక్తమోడుతూ, గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మానవత్వాన్ని నిలువునా పాతిపెట్టిన ఈ ఘటన ఒడిశా.. కేంద్రపాడ జిల్లా పాతముండై పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. శునకాన్ని చంపిన ఆ నిందితుడు బాబుల్ సింగ్.