వందల ఫోన్లు ఉంటే ఒక్కటే దొంగలించాడు - బెంగళూరు మొబైల్షాప్లో దొంగతనం
🎬 Watch Now: Feature Video
దుకాణంలో దొంగ చొరబడితే ఉన్న కాడికి ఊడ్చేస్తాడు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఓ దొంగ అందుకు భిన్నంగా చేశాడు. కావాల్సింది మాత్రమే చోరీ చేసి మిగతా వాటిని కనీసం ముట్టుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరు కుందనహల్లిలోని సంగీత మొబైల్ షాపులో జరిగింది. చుట్టూ పదుల సంఖ్యలో రకరకాల ఫోన్లు ఉండగా.. ఆ దొంగ తనకు కావాల్సిన దానిని మాత్రమే తీసుకువెళ్లాడు. భారీ బడ్డెట్ ఫోన్లు పక్కన ఉన్నా వాటి వైపు కన్నేత్తి కూడా చూడలేదు. పనిలో పనిగా కౌంటర్లో ఉన్న 11,500 కూడా తీసుకుని ఉడాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.