రెండు గంటలు చిన్నారి మెడలోనే నాగుపాము- చివరకు.. - snake bite child in mh
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర వార్దాలో ఏడేళ్ల చిన్నారిని నాగుపాము (Snake bite) కాటేసింది. రెండు గంటల పాటు నాగుపాము.. చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము పారిపోయింది. సర్పాన్ని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం లేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.