నడిరోడ్డుపై భార్యను ఈడ్చుకెళ్లిన 'పోలీస్' భర్త! - video viral
🎬 Watch Now: Feature Video
క్రమశిక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి రెచ్చిపోయి నడ్డిరోడ్డుపై భార్యను చితకబాదాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య నిలదీసినందుకు దాడికి పాల్పడ్డాడు. రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తూ చిత్రహింసలు పెట్టాడు. ఈ ప్రబుద్ధుడు మధ్యప్రదేశ్‌లోని గంద్వాడీ పోలీస్‌స్టేషన్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దారుణాన్ని మిగతా పోలీసులు... ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Mar 1, 2020, 4:30 AM IST