లైవ్ వీడియో: వరద సహాయక చర్యల్లో పడవ బోల్తా - కొల్హాపుర్
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కొల్హాపుర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విపత్తు స్పందన దళం సిబ్బంది చిన్నచిన్న పడవలపై బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలోని వీనస్ కార్నర్ వద్ద ముగ్గురు మహిళలను పడవలో ఎక్కించుకుని తీసుకెళుతున్న క్రమంలో ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే తేరుకున్న సిబ్బంది నీటిలో పడిపోయిన మహిళలకు రబ్బరు ట్యూబులను అందించి రక్షించారు. అనంతరం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Last Updated : Aug 7, 2019, 4:57 PM IST