ఊరంతా చిందులెయ్యాలా .. కరోనాను పక్కనపెట్టాలా! - కరోనా సమయంలో డీజే డ్యాన్స్​లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2021, 9:23 AM IST

వైరస్​ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆంక్షలు విధించినా.. కొందరు వాటిని ఖాతరు చేయట్లేదు. గుజరాత్​ సాబర్​కంటా జిల్లాలోని నాడా గ్రామంలో.. ఓ వివాహ వేడుకలో వందలాది మంది కలిసి నృత్యాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేడుకల్లో 50మంది కన్నా ఎక్కువ పాల్గొనకూడదు. అయినా.. భౌతిక దూరం, మాస్క్​లు వంటి నిబంధనలను పక్కనపెట్టి గుంపులుగా చిందులేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.