మ్యాజిక్ దీపాలు వచ్చేశాయి.. నీరు పోస్తే వెలుగుతాయ్.. తీసిస్తే ఆరిపోతాయ్ - Water lamps
🎬 Watch Now: Feature Video
water lit lamps: అమావాస్యనాడు వచ్చే పండుగ దీపావళి.. ఇల్లంతా అలంకరించిన దీపాల కాంతులు మరింత సందడిని నింపుతుంది. కాలక్రమేణా ప్రమిదల్లో దీపాలు వెలిగించడంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి దీపావళి చేసుకోవడం అలవాటైపోయింది. ఇప్పడుప్పుడు విద్యుత్ దీపాలు, రంగు రంగుల ఎల్ఈడీ దీపాలు తోరణాలు పండుగతో పాటు ఇళ్లలో చేరి పోయాయి. అంతే కాకుండా మట్టి ప్రమిదలను నీటిలో నానబెట్టి నీడలో ఆరబెడితే తక్కువ నూనె ఖర్చు అవుతోందని అమ్మ ఉపాయం చెబుతుంది మీకు గుర్తుందా!! ఇవ్వన్ని ఇప్పడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నరా.. ఈ దీపావళికి మరింత వెలుగులు నింపడానికి.. నూనె ఆదాచేయడానికి ఈసారి ప్లాస్టిక్ ప్రమిదలతో ఉండే దీపాలు వచ్చేశాయి. వీటి ప్రత్యేకత ఎమిటంటే వీటిలో నీరు పోస్తే దీపం వెలుగుతోంది.. నీరు తీసివేస్తే దీపం ఆరిపోతోంది. దీనికి ఒకసారి ఛార్జింగ్ ఎక్కిస్తే 48గంటలు పాటు నిరంతరాయంగా వెలుగుతోంది. దీని ధర కూడా రూ.80 కావడంతో వినియోగదారులు కొనడానికి బాగా ఆసక్తీ చూపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST