ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు చివరకు జాక్‌పాట్ - ప్రేయసి కోసం బావిలో దూకిన వ్యక్తి వీడియో
🎬 Watch Now: Feature Video
ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి యువతి కుటుంబ సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు. బిహార్‌లోని ఛప్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గడ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీరాజ్పుర్లో ఉండే మున్నా రాజ్ అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. రాత్రివేళ శబ్దాలు రావడాన్ని గమనించిన యువతి కుటుంబ సభ్యులు లేచి చూశారు. ఇంట్లోకి వచ్చిన మున్నా రాజ్‌ను తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు దగ్గర్లోని బావిలోకి దూకేశాడు మున్నా. ఉదయం గ్రామస్థుల సాయంతో యువతి కుటుంబ సభ్యులు అతడిని తాళ్లతో బయటకు తీశారు. అనంతరం ఈ ఘటనపై పంచాయతీ పెట్టారు. గ్రామపెద్దలు యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఒప్పించి మున్నా రాజ్‌కు యువతినిచ్చి స్థానిక ఆలయంలో వివాహం జరిపించారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST