బాలికపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. డ్రైవర్‌కు నిప్పంటించిన స్థానికులు - మధ్యప్రదేశ్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Angry mob burnt driver alive: మధ్యప్రదేశ్ అలీరాజ్‌పుర్ జిల్లాలో ఘోరం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికను పికప్ ట్రక్కుతో ఢీకొట్టిన వ్యక్తి... స్థానికుల ఆగ్రహానికి బలయ్యాడు. ఐదేళ్ల బాలికపైకి పికప్ దూసుకెళ్లగా... ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు డ్రైవర్ నడుపుతున్న ట్రక్కుకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే డ్రైవర్ థాన్సింగ్ రావత్(22)కు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST