కవితకు వినూత్నంగా బర్త్‌డే విషెష్.. 20 వేల నాణేలతో 12 అడుగుల చిత్రం.. - హ్యాపీ బర్త్ డే కవితక్క
🎬 Watch Now: Feature Video
Birthday wishes to Kavitha: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం (మార్చి 13) సందర్భంగా తన అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. నిజామాబాద్‌లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో.. నేలపై నాణాలతో 12 అడుగుల కవిత చిత్రాన్ని రూపొందించారు. తన చిత్రంతో పాటు "హ్యాపీ బర్త్ డే కవితక్క" అని రాసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన తెరాస యువ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. ప్రతీ సారి వినూత్నంగా కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిజేస్తుంటాడు. అందులో భాగంగానే.. హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల మీదుగా ఈ కళాఖండాన్ని తయారు చేయించాడు. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి సుమారు 20 వేల నాణేలను ఉపయోగించారు. 15 గంటలకు పైగా ఆరుగురు కళాకారులు శ్రమించారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST