ఆ కష్టాలు తలుచుకుని ఏడ్చేసిన ఛార్మి, విజయ్‌కు థ్యాంక్యూ
🎬 Watch Now: Feature Video
కొవిడ్, లాక్డౌన్ పరిణామాల అనంతరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు ఛార్మి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న లైగర్.. ఈనెల 25 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌తో ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెపుతూ ఏడ్చింది. ''2019 ఆగస్టు నెలలోనే నేను, పూరి మిమ్మల్ని కలిసి కథ చెప్పాం. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. వరుస లాక్డౌన్లు వచ్చాయి. ఈ కష్టసమయంలోనూ ఆర్థికంగా చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఓటీటీకి అమ్మడానికి భారీ ఆఫర్ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి. ఆ దమ్మున్న వ్యక్తి పూరి. ఇది థియేటర్ ఫిల్మ్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాం. దృఢ సంకల్పం ఉన్న పూరిలాంటి వ్యక్తి కూడా ఈ జర్నీలో కొన్నిసార్లు నిరాశకు గురయ్యారు. కానీ, రెండే రెండు విషయాలు ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. ఒకటి విజయ్ దేవరకొండ. ప్రతి పరిస్థితుల్లో విజయ్ ఎంత బలంగా నిలబడ్డాడో జనాలకు తెలియదు. నువ్వే (విజయ్) మమ్మల్ని ముందుకు నడిపిన వ్యక్తివి. రెండోది కంటెంట్. ఈ సినిమా కథ. థ్యాంక్యూ విజయ్'' అంటూ ఛార్మి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST