ETV Bharat / sukhibhava

మీ గోళ్లు ఇలా మారితే చాలా డేంజర్.. ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం! - గోళ్లు సమస్యలు ఇచ్చే ఆరోగ్య సూచనలు న్యూస్

సాధారణంగా వైద్యులు కళ్లను చూసి శరీర ఆరోగ్య పరిస్థితుల గురించి చెబుతుంటారు. అయితే గోళ్లను చూసి కూడా ఆరోగ్యస్థితిని అంచనా వేయొచ్చట! అనారోగ్యం కారణంగా శరీరంలో వచ్చే మార్పులను మన గోళ్లు ప్రతిబింబిస్తాయట. గోర్ల రంగును బట్టి అనారోగ్యాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందామా?

Your Nails Say About Your Health
గోళ్లు చెప్పే ఆరోగ్య సూచనలు
author img

By

Published : Nov 28, 2022, 7:34 AM IST

డాక్టర్లు కళ్లను చూసి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంటారు అని అందరికీ తెలుసు. అయితే గోళ్లను చూసి కూడా మన ఆరోగ్య సంబంధిత అంశాలను తెలుసుకోవచ్చట. గోళ్ల రంగు, రూపురేఖలలో వచ్చే మార్పులు అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. అందుకే గోళ్లలో వచ్చే మార్పులు ఎక్కువగా కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే గోళ్లలో వచ్చే కొన్ని మార్పులు.. గుండె, కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలకు సూచనలకు కారణం అంటున్నారు వైద్య నిపుణులు.

గోళ్లలో వచ్చే కొన్ని మార్పులను బట్టి మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే కొన్ని సూచనలను వైద్య నిపుణులు తెలిపారు. అవేంటంటే..

  1. గోళ్ల రంగు పూర్తిగా లేదా పాక్షికంగా తెల్లగా ఉంటే అది ఏదైనా గాయం, రక్తహీనత, పోషకాహార లోపం అని భావించొచ్చు.
  2. అలా కాకుండా గోళ్లు చాలా వరకు తెల్లగా ఉండి అంచులు ముదురు రంగులో కన్పిస్తుంటే.. హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది.
  3. గోళ్లు పసుపు రంగులో ఉంటే అది ఇన్ఫెక్షన్​గా భావించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ పెరిగిన కొద్దీ గోళ్లు మందంగా మారి విరిగిపోతుంటాయి. చాలా అరుదుగా థైరాయిడ్, మధుమేహం, సొరియాసిస్ వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.
  4. గోళ్లు నీలిరంగులో కనిపిస్తే మన శరీరానికి తగినంత ఆక్సిజన్ అందట్లేదని భావించవచ్చు. ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం కూడా కావచ్చు. అలాగే కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యలు ఉన్నా గోళ్లు నీలి రంగులోకి మారతాయి.
  5. గోళ్ల ఉపరితలం గుంటలు పడినట్లుగా కన్పిస్తే అది సొరియాసిస్ లేదా వాపుతో కూడిన కీళ్ల నొప్పులకు ప్రారంభ సంకేతం అయ్యే అవకాశం ఉంది.
  6. కొన్నిసార్లు నెయిల్స్ బాగా పొడిబారి పెలుసుగా మారి చిట్లుతుంటాయి. ఈ సమస్య తరుచుగా తలెత్తితే అది థైరాయిడ్ వ్యాధికి సంకేతమని అనుమానించాలి.
  7. గోళ్ల చుట్టూ ఉన్న చర్మం వాచిపోయి, ఎరుపెక్కి సున్నితంగా మారుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా సొరియాసిస్ వలన ఈ సమస్య వస్తుంది. దీనికి పైపూతలుగా వాడే స్టెరాయిడ్​లను ఉపయోగించాలి.
  8. నెయిల్స్ కింద ముదురు రంగులో గీతలు కనపడుతుంటే దానిని 'మెలనోనికియా' అంటారు.
  9. కొంతమందిలో నెయిల్స్ రఫ్​గా ఉండి, గుంతలు గుంతలుగా ఉంటాయి. వీటిని పిట్టింగ్ ఆఫ్ నెయిల్స్, రిడ్జింగ్ ఆఫ్ నెయిల్స్ అంటారు.
  10. గోర్లు పట్టుకునేటప్పుడు ఎగుడుదిగుడుగా ఉండటం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు తలెత్తితే సొరియాసిస్, అటోపిక్ డమటైటిస్ వంటి సమస్యలేమోనని టెస్ట్ చేసుకుంటే మంచింది. ఏదైనా దెబ్బతగిలి మానకుంటే అటోఇమ్యునో డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది.
  11. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి వాటిలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే గోళ్లలో కొన్ని మార్పులు కన్పిస్తాయి. అనీమియా(రక్త హీనత) వంటి సమస్యలలో కూడా నెయిల్స్​లో మార్పులు కన్పిస్తాయి.
  12. కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దీ గోళ్ల మందం పెరిగిపోతుంది. అయితే కొద్దిమందిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. దీంతో వారు గోళ్లు కట్ చేస్తుంటే తెగకుండా ఉండి, బాగా పెరిగి గోరుకు ఏదైనా తగిలినప్పుడు చాలా నొప్పిగా ఉండటం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలలో డాక్టర్​ను సంప్రదించడం మంచిది.
  13. కొంతమందికి గోళ్లను కొరికే అలవాటు విపరీతంగా ఉంటుంది. ఆందోళన కారణంగా ఇలా చేస్తుంటారు. ఇలాంటి వాళ్లలో నెయిల్స్​ సైజు తగ్గిపోయి, అక్కడ చర్మం ఉబ్బెత్తుగా కనపడుతుంది. చికిత్సతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అప్సెసివ్, కంపెల్సివ్ ఉన్న వాళ్లకు కూడా గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును మానుకోకపోతే వైద్యులను సంప్రదించటం మంచిది.
  14. గోళ్ల మధ్య భాగం గుంటలా మారిపోతే 'స్పూన్ నెయిల్స్' అంటారు. శరీరంలో ఐరన్ లోపించి, రక్తలేమి ఏర్పడినా లేదా లివర్​కు సంబంధించిన సమస్య ఉన్నా నెయిల్స్ అలా కనిపించే అవకాశం ఉంది.
  15. అయితే గోళ్లలో కనిపించే మార్పులన్నీ శరీరంలోపల అనారోగ్యాలకు సూచనలు కావు. వేళ్లు, చేతులకు గాయాలైనా, ఇన్ఫెక్షన్లు సోకినా ఆ మార్పులు కన్పిస్తాయి.
  16. నెయిల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రొటీన్లు, సిలికా, ఐరన్, జింక్ వంటి పోషకాలు అవసరం.
  17. గోళ్లకు సంబంధించిన ఆందోళనకరమైన సమస్యలు కనిపించినప్పుడు వెంటనే చర్మ సంబంధిత డాక్టర్​ను సంప్రదించటం ఉత్తమం.

మన శరీరంలో వచ్చిన మార్పులు కొంత కాలం తరువాత గోళ్లలో కనిపిస్తాయి. అంటే మనకు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా శరీరంలో వచ్చే మార్పులు గోళ్లలో చూస్తామన్నమాట. గత కొన్ని నెలల్లో మనకు వచ్చిన ఆరోగ్య సమస్యలను మన గోళ్ల ద్వారా అంచనా వేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఒకటి లేదా రెండు గోళ్లలో మాత్రమే కొన్ని మార్పులు కన్పిస్తాయి. అయితే ఏదో చిన్న దెబ్బ తగిలి ఈ మార్పులు వచ్చాయేమోనని వదిలేస్తే, అది ఇన్ఫెక్షన్​కు దారితీసే ప్రమాదం ఉంది.

ఈ ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త..
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నీటిలో ఎక్కువగా చేతులు తడిపేవారిలో, డయాబెటిక్ పేషెంట్లలో కన్పిస్తాయి. అలాంటి సందర్భాలలో వాటికి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ వాడుతూ.. క్రీమ్స్​ను దానితోపాటు వాడితేనే మనకు ఫలితం ఉంటుంది. గోళ్ల చుట్టూ వాపు రావటం, చీము పట్టడం, నొప్పిగా ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను 'గోరుచుట్టు' అంటారు. నెయిల్ దగ్గర ఉండే ప్రొటెక్టివ్ లేయర్ 'క్యుటికల్' దెబ్బతినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.

ఎక్కువగా శానిటైజ్ చేసుకోవటం, గాఢమైన సబ్బులను వాడినప్పుడు ఆ నురుగ గోళ్ల లోపలికి చేరి, వాపు ఏర్పడి నొప్పి వస్తుంటుంది. దీనికోసం మనం వాడే మాయిశ్చరైజర్, గాఢమైన సబ్బులను మార్చితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కొంతమంది రోజుకు 20సార్లు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఈ అలవాటును తగ్గించుకుంటే మంచిది. గోళ్లు కొరికే అలవాటు కూడా మానుకుంటే ఈ 'క్రోనిక్ పారోనేకియా' సమస్యను తగ్గించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.