ETV Bharat / sukhibhava

కొవిడ్​ వేళ థైరాయిడ్​ సమస్యను అధిగమించటం ఎలా?

author img

By

Published : May 25, 2021, 6:56 PM IST

మన ఆరోగ్యానికి రక్షణ చేకూర్చే థైరాయిడ్ గ్రంథి అవ్యవస్థతో బాధపడే వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోంది. 10 మందిలో ఒకరు థైరాయిడ్ గ్రంథి క్రియారాహిత్యంతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ అంటే ఏమిటి? ఈ కొవిడ్ కాలంలో థైరాయిడ్ సమస్యలను ఎలా అధిగమించాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

Thyroid
థైరాయిడ్ ను ఎదుర్కోండిలా..!

2008 నుంచి ప్రతి ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్ రోజుగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్, ఐరోపా థైరాయిడ్ అసోసియేషన్, ఆ తరవాత మరిన్ని సంస్థలు చేరాయి. దీని ప్రధాన ఉద్దేశం థైరాయిడ్ సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం, ఈ రంగంలో సాధించిన అభివృద్ధిని తెలియచేయటం.

"మన శరీర బరువు, అది ఖర్చు పెట్టే శక్తి థైరాయిడ్ స్రవించే హర్మోన్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో కలిగే అసాధారణ మార్పులు, ఉదాహరణకు హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం, థైరాయిడ్ శోథ మొదలైనవి కలిగినపుడు జుట్టు రాలిపోవటం, మలబద్ధకం, శరీర బరువు పెరగటం/తగ్గటం అసాధారణ రుతుచక్రం, అలసట, నిస్సత్తువ మొదలైనవి కలుగుతాయ"ని బెంగళూరు కోరమంగళ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో పోషకాహార నిపుణులుగా పని చేస్తున్న వైద్యులు శరణ్య శ్రీనివాస శాస్త్రి చెబుతున్నారు.

శరీరంలో అన్ని రకాల చర్యలకు కారణమైన హర్మోన్లను తయారుచేసేదే ఈ గ్రంథి. సీతాకోక చిలుక ఆకారంలో గొంతులో అమరి ఉండే ఈ నిస్రోతస్క/నాళ రహిత గ్రంథి అతిగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజం అని తక్కువగా పనిచేస్తే హైపో థైరాయిడిజం అని అంటాం.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు:

ఆందోళన, గుండె దడ, ఆదుర్దా, చిరాకు, చెమట ఎక్కువగా పట్టడం, బరువు తగ్గటం, బలహీనత, చర్మం మందం తగ్గటం మొదలైన లక్షణాలు కలుగుతాయి.

ఈ లక్షణాలు కల జబ్బులు

  1. గ్రేవ్స్ వ్యాధి – థైరాయిడ్ హర్మోన్లు అధికంగా ఉత్పత్తి కావటం, థైరాయిడ్ గ్రంథి ఉబ్బి ఉండటం
  2. థైరాయిడ్ కంతులు – గ్రంథి లోపలే కంతులు ఏర్పడటం
  3. థైరాయిడ్ శోథ – థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్
  4. అధిక మోతాదులో అయోడిన్

హైపో థైరాయిడిజం లక్షణాలు

అలసట, పొడిబారిన జుట్టు, చర్మం, బలహీనత, బరువు పెరగటం, తగ్గిన గుండె వేగం, మలబద్ధకం, వ్యాకులత, చలిని తట్టుకోలేకపోవటం మొదలైన లక్షణాలు కలుగుతాయి.

  1. థైరాయిడ్ శోథ
  2. హషిమోతో థైరాయిడ్ శోథ – రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని ముట్టడించటం
  3. కాన్పు తరువాతి థైరాయిడ్ శోథ – ఇది తాత్కాలికం
  4. అయోడిన్ లోటు
  5. క్రియారహితమైన థైరాయిడ్ గ్రంథి

థైరాయిడ్ రక్షణ

  • యోగా, ధ్యానంతో విశ్రాంతి పొందండి.
  • ఇంటిపట్టునే ఉన్నామని అధికంగా తినకపోవటం మంచిది
  • మీ ఔషధాలు సైరన వేళలు పాటించటం.
  • మద్యానికి దూరంగా ఉండటం. ఆల్కాహాల్​ థైరాయిడ్ క్రియలను ప్రభావితం చేస్తుంది.
  • 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవటం అవసరం.
  • ప్రతి రోజు శారీరక వ్యాయామం తప్పని సరి.
  • కొవిడ్ టీకా తప్పక తీసుకోవాలి.
  • కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి

ఆహార పదార్థాలు:

సరిపడా అయోడిన్, అమినో ఆమ్లాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటూ శారీరక వ్యాయామం చేయాలి. థైరాయిడ్ సమస్యలున్నవారు కింద సూచించిన వాటిని తీసుకోవాలి.

  • కుంకుమ పువ్వు
  • అరటిపండు
  • ఉలవలు
  • చేపల వేపుడు
  • కిచిడీ/పొంగలి
  • జల్లెడ పట్టని పిండితో చేసిన ఆహారం, పప్పు

థైరాయిడ్ సమస్య ఉన్నట్టయితే ముందుగా వైద్యుడిని సంప్రదించి తీసుకునే ఆహారాన్ని నిర్ణయించుకోవాలి. మార్చుకున్న ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.