బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణవార్త సినీ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. బిగ్‌బాస్ 13వ సీజన్ ద్వారా బుల్లితెర అభిమానులకు మరింత చేరువైన సిద్ధార్థ్ శుక్లా.. గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అతడి వయసు 40 మాత్రమే. ఇలా చిన్న వయసులో సిద్ధారే కాకుండా దేశంలో అనేకమంది యువత గుండెపోటుకు బలవుతున్నారు. తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడానికి వెనుక అనేక కారణాలున్నాయని వైద్యులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో యువత గుండె సంబంధిత వ్యాధులు బారిన పడే అవకాశాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు. మానసిక ఒత్తిడి, శారీరక ఆరోగ్యం లేదా ఇతర కారణాలతో హార్ట్ ఎటాక్ వస్తుందని చెబుతున్నారు. వీటితో పాటు గుండె సంబంధింత వ్యాధులపై నిపుణులు చెబుతున్న విషయాలు చూద్దాం.
క్రమంగా వ్యాయామం చేయడం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించిన వారు కూడా గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు?
వ్యాయామం ఒక్కటే కాదు.. ఒత్తిడి అనేది మనిషి మద్యపానం, డ్రగ్స్ సేవించేందుకు ప్రేరేపిస్తుంది. ప్రజలు వ్యాయామంతో రోజును ప్రారంభించినా.. చివరికి ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌తో ముగిస్తున్నారు. వీటి వల్ల శరీరంలోని హార్మోన్లలో మార్పు కారణంగా కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఒకే విధమైన ప్రాధాన్యమివ్వాలి. రోజంతా ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం. ఎంతోమంది విరామం లేకుండా గంటల కొద్ది పనిచేస్తుంటారు. వారు తమ శారీరిక, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యమివ్వాలని భావించడం లేదు. వృత్తిపరమైన జీవితంలో తమను తాము నిరూపించుకునే క్రమంలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు.
గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించడానికి కుటుంబ చరిత్ర కూడా ఓ కారణమా?
ఆసియాలోని ఎక్కువ మందిలో గుండె సంబంధిత వ్యాధులు మనలోని జన్యువుల ద్వారా సంక్రమిస్తున్నాయి. వాటిని మనం ఏమీ చేయలేం. అందువల్ల పశ్చిమ దేశాల వారితో పోలిస్తే మన దేశంలోని ఎక్కువమంది యువత గుండె పోటుకు గురవుతున్నారు.
యువతలో ఈ రుగ్మతలను నిర్మూలించేందుకు చేయాల్సిన పనులేంటి?
క్రమంగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఒత్తిడిని పోగొట్టేందుకు అలవాటు చేసుకున్న ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ సేవించడం పూర్తిగా మానేయాలి. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. జీవనాశైలిలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి.. సిద్దార్థ్ మృతికి ముందురోజు రాత్రి ఏం జరిగింది?