పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ మధ్య మధ్యలో శ్వాసతీసుకోవడం ఆపుతుంటారు. దీనినే బ్రీత్ హోల్డింగ్ స్పెల్స్ (Breath Holding Spells) అంటారు. ఇందులో భాగంగా ఒక్కోసారి వారి ముఖం లేదా పెదవులు నీలంగా మారుతుంటాయి. ఏడుపు తారస్థాయికి చేరినప్పుడు (Breath Holding Spells) పలు సందర్భాల్లో చిన్నారులు స్పృహకోల్పోయి జెర్క్స్ వస్తుంటాయి. దాదాపు ఫిట్స్‌ను పోలి ఉన్న ఈ సమస్యకు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కోపం, ఏదైనా నొప్పి, ఇంకా తన మాట వినడం లేదనే మొండితనం (Breath Holding Spells) కారణంగా పిల్లల్లో ఏడుపు మొదలై తారస్థాయికి వెళ్తుందని.. ఆ తర్వాత అది కాస్త ఊపిరి అందక ఇబ్బంది పెడుతుందని నిపుణులు పేర్కొన్నారు. హెమోగ్లోబిన్, ఐరన్ తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ బ్రీత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి అధికంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
దీనికి చికిత్స ఉంటుందా?
దీనికి ప్రత్యేకించి చికిత్స అంటూ ఏం ఉండదు. పరీక్షల ద్వారా హెమోగ్లోబిన్, ఐరన్ డెఫిషియన్సీలకు సంబంధించి వివరాలు తెలుసుకుని అందుకు తగిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మందులు లేదా ఆహారం ద్వారా అయినా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కానీ ఆహారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పంచదార స్థానంలో బెల్లం వాడటం, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవడం ద్వారా దీనికి చెక్ పెట్టొచ్చు అంటున్నారు.
సమస్య మరింత ఎక్కువగా వస్తోందంటే దానిని ఆపేందుకు పేరెంట్స్ లేదా ఇతర కుటుంబసభ్యులు తమ వంతు పాత్ర పోషించాలిని సూచిస్తున్నారు. చిన్నారికి కావాల్సిన మోతాదులో రెస్ట్ ఉండాలని.. రెస్ట్‌లెస్‌గా ఉండటం గుక్కపట్టి ఏడవటానికి దారితీయొచ్చని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : Salt Effects: ఉప్పు.. మెదడు ఆరోగ్యానికి ముప్పు!