Why Am I Always Hungry : శరీరానికి శక్తి ఉంటేనే ఏ పనైనా చేయగలదు. శరీరానికి శక్తిని అందించడానికి ఆహారం తీసుకోవాలి. సహజంగా మనకు ఆకలి అవుతుందంటే.. శరీరానికి తగినంత శక్తి లేదు అని అర్థం. అప్పుడు మనం ఏదో ఒక ఆహారాన్ని శరీరానికి అందించాలి. ఆకలి వేయడం అనేది ఆరోగ్యానికి సంకేతంగా వైద్యులు చెబుతుంటారు.
అయితే కొంతమందిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. తిన్న కాసేపటికే ఆకలి వేయడం, ఎంత తిన్నా కడుపు నిండినట్లు అనిపించకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండటానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చని వివరిస్తున్నారు. కొంతమంది ఏదో ఒకటి తినాలనే ఉద్దేశంతో అసంపూర్తిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ఆకలికి కారణం కావచ్చు. మరికొందరిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి భావన కలుగుతుంది. చక్కెర ఉండే తీపి పదార్ధాలు తినడం వల్ల ఆకలి కలుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఆకలి కలుగుతున్న భావన కలగవచ్చు. అలర్జీ, డయాబెటిస్తో బాధపడే వారు, తమ అనారోగ్య సమస్యలకు స్టెరాయిడ్స్ లాంటి వాటిని వాడే వాళ్లలో కొంతమంది ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు తక్కువ ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుంటుంది.
-డా. మధులిక ఆరుట్ల, న్యూట్రిషనిస్ట్
Foods That Stop Hunger : బాగా ఆకలిగా అనిపించే వారు ఆహారాన్ని ఎక్కువ సేపు బాగా నమిలి మింగాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రెండు కప్పుల తాజా పండ్లను, మూడు కప్పుల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ అంజీర్, ఖర్జూర, కిస్ మిస్, మొలకెత్తిన పెసర్లు, పెబ్బర్లు తినడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు. ఆడవాళ్లలో హార్మోన్ల సమస్య తలెత్తితే, దానికి చికిత్సకు నిపుణులను సంప్రదించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇక తీసుకునే మందుల వల్ల ఈ సమస్య తలెత్తుతున్నట్లయితే వైద్యులను సంప్రదించి, పరిష్కారాలను అడగవచ్చు. శరీరానికి తగినంత నిద్ర, వ్యాయామం ఉండేలా చూసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడటానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Drinking Water Before Sleep : నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు?
Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్‌కు డోకా ఉండదు!