ETV Bharat / sukhibhava

కొవిడ్​తో మారిన వైద్యం తీరు- ఇంటి చికిత్సకు జై! - Thermometer

కరోనా వల్ల వైద్యం తీరు మారిపోయింది. తప్పనిసరి అయితే తప్పా బయటకు వచ్చే పరిస్థితే లేదు. టెలీ మెడిసిన్​ ప్రాధాన్యం పెరిగింది. సంప్రదింపులన్నీ ఫోన్​లోనే.. మరి ఇలాంటి సమయంలో సమస్య కచ్చితంగా చెబితేనే వైద్యులు సరైన సలహాలు, సూచనలు ఇవ్వగలరు. అంత కచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Which type of equipment have install in Home for medicine
కొవిడ్​తో మారిన వైద్యం తీరు- ఇంటి వైద్యానికి జై!
author img

By

Published : Dec 4, 2020, 10:23 AM IST

కొవిడ్‌-19 కొత్త పాఠాలు నేర్పింది. వైద్యం తీరుతెన్నులను గణనీయంగా మార్చేసింది. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో టెలీ మెడిసిన్‌కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. ఫోన్, వాట్సాప్, వెబ్‌సైట్ల ద్వారానే డాక్టర్లను సంప్రదించటం పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో మన గురించి డాక్టర్లకు కచ్చితమైన సమాచారం అందించేదెలా? ఈ విషయంలో క్లినిక్‌లలో తరచూ వాడే కొన్ని పరికరాలను ఇంట్లో ఉంచుకోవటం ఎంతగానో మేలు చేస్తుంది. డాక్టర్లు అడిగే విషయాల గురించి వెంటనే వివరించటానికి.. సమస్య మామూలుదా? అత్యవసరమైందా? అనేది తేల్చుకోవటానికిది ఉపయోగపడుతుంది.

థర్మామీటర్‌

ప్రస్తుతం డాక్టర్లంతా ముందుగా అడిగేది జ్వరం గురించే. దీన్ని తెలుసుకోవటానికి థర్మామీటరు తప్పనిసరి. కాబట్టి ఇంట్లో పాదరస రహిత థర్మామీటర్‌ (డిజిటల్‌ థర్మామీటర్‌) ఉంచుకోవటం మంచిది. దీన్ని ఉపయోగించటం తేలిక. శరీర ఉష్ణోగ్రతను బట్టి డాక్టర్లు రకరకాల జబ్బులను అంచనా వేస్తారు. ఈ రోజుల్లో జ్వరం 100 డిగ్రీల సెల్షియస్‌ కన్నా తక్కువుంటే కొవిడ్‌గా, 101 కన్నా ఎక్కువుంటే ఇతరత్రా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లుగా భావించొచ్చు. జ్వరం దశ దశలుగా ఎక్కువవుతూ వస్తుంటే టైఫాయిడ్‌గా, సాయంత్రం పూట జ్వరం వస్తుంటే క్షయగా, ఉష్ణోగ్రత 104 కన్నా ఎక్కువుంటే మలేరియాగా.. ఇలా ఒక అంచనాకు రావటానికి వీలుంటుంది.

బరువు యంత్రం

నాణ్యమైన బరువు తూచే పరికరం కూడా ముఖ్యమే. స్ప్రింగుతో కూడిన దాని కన్నా ఎలక్ట్రానిక్‌ పరికరమైతే మేలు. దీంతో ఎప్పటికప్పుడు బరువు పెరగటం, తగ్గటం తెలుసుకోవచ్చు. గుండె, కిడ్నీ, కాలేయ సమస్యలు గలవారిలో ఒంట్లో నీరు నిల్వ ఉండిపోతుంటుంది. ఇది బరువులో ప్రతిఫలిస్తుంది. దీని ద్వారా మందులు పనిచేస్తున్నాయా? మోతాదు పెంచాల్సి ఉంటుందా? అనేవి తెలుసుకోవచ్చు.

గ్లూకోమీటరు

ఇటీవలి కాలంలో ఇది ఇంటింటి పరికరంగా మారిపోయింది. భోజనానికి ముందూ తర్వాతా రక్తంలో గ్లూకోజు మోతాదులు తెలుసుకోవటాకిది ఎంతగానో తోడ్పడుతుంది. ఇన్సులిన్‌ తీసుకునేవారు ఎప్పటికప్పుడు గ్లూకోజు మోతాదులు తెలుసుకోవటానికి, గ్లూకోజు మోతాదు బాగా పడిపోయిందనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే పరీక్షించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎవరికివారు ఇన్సులిన్‌ మోతాదు మార్చుకోవచ్చు. లేదూ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవచ్చు. కొవిడ్‌ దుష్ప్రభావాలకూ మధుమేహానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటున్న తరుణంలో గ్లూకోమీటరు ఇంట్లో ఉండటం తప్పనిసరి అవుతోంది.

రక్తపోటు పరికరం

జబ్బులు ఏవైనా డాక్టర్లు విధిగా రక్తపోటు పరీక్షిస్తుంటారు. ఆసుపత్రులకు వెళ్లలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఒక బీపీ పరికరం ఉంచుకోవటం ఎంతైనా మంచిది. ఇప్పుడు పాదరస రహిత, స్టెతస్కోప్‌ అవసరం లేని ఎలక్ట్రానిక్‌ బీపీ పరికరాలు బాగానే అందుబాటులో ఉన్నాయి. వీటితో ఇంట్లోనే రక్తపోటును తేలికగా పరీక్షించుకోవచ్చు. దీన్ని బట్టి రక్తపోటు తీరుతెన్నులను తెలుసుకోవచ్చు. అవసరమైతే డాక్టర్లు మందుల మోతాదు పెంచటం, తగ్గించటం చేస్తారు.

Which type of equipment have install in Home for home medicine
రక్తపోటు పరికరం

పీక్‌ ఫ్లో మీటర్‌

ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే పరికరమిది. గట్టిగా శ్వాస తీసుకొని ఒక్కసారిగా ఇందులోకి గాలిని ఊదాల్సి ఉంటుంది. దీంతో అత్యధిక నిశ్వాస ప్రవాహ వేగం బయటపడుతుంది. ఆస్థమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు గలవారికిది బాగా ఉపయోగపడుతుంది. మందుల మోతాదు పెంచినా నిశ్వాస వేగం పెరగకపోతే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అత్యవసర పరిస్థితిని ముందుగానే పసిగట్టటానికి వీలుంటుంది.

చిన్న టార్చిలైటు

నోట్లో నాలుక, అంగిలి, కొండ నాలుక వరకు అన్ని భాగాలను దీంతో స్పష్టంగా చూడొచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా డాక్టరుకు చూపించొచ్చు. రక్తహీనతలో నాలుక పాలిపోతుంది. తీవ్ర బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో నోరంతా ఎర్రగా అయిపోతుంది. ఇలా రకరకాల జబ్బులను తెలుసుకోవటాకిది ఉపయోగపడుతుంది.

భూతద్దం

చర్మ సమస్యలను, చర్మం మీద తలెత్తే మార్పులను స్పష్టంగా గుర్తించటానికిది అవసరం. చర్మం మీద మచ్చల రంగు, వాటి అంచులు, అంచుల మీది బొడిపెల ఆధారంగా బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లను గుర్తించొచ్చు. పైకి కనిపించకుండా ఉండిపోయే ఇతరత్రా జబ్బులనూ చర్మం మీద తలెత్తే మార్పులతో పసిగట్టొచ్చు. భూతద్దంతో డాక్టర్‌కు చూపించటం కష్టమనుకుంటే ఫోన్‌ ద్వారా ఫోటో తీసి, పెద్దదిగా చేసి పంపొచ్చు.

స్టెతస్కోప్

డాక్టర్‌ అనగానే గుర్తొచ్చేది ఇదే. దీంతో గుండె ఎలా కొట్టుకుంటోంది? శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎలాంటి చప్పుడు వస్తోంది? అనేది తెలుసుకోవచ్చు. గుండె లయలో తేడాలు గుర్తిస్తే వెంటనే డాక్టర్ల దృష్టికి తీసుకురావొచ్చు. స్టెతస్కోప్‌తో వృద్ధుల్లో వినికిడి లోపాన్నీ తెలుసుకోవచ్చు. స్టెతస్కోప్‌ చెవులకు తగిలించినా చప్పుడును గుర్తించలేకపోతే వినికిడి లోపం ఉందనే అనుకోవచ్చు.

కొలత టేపు

ఇది దాదాపు అందరి ఇళ్లలోనూ ఉండేదే. దీంతో ఎత్తును కొలుచుకొని, ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. తుంటి, నడుం చుట్టుకొలతల మధ్య నిష్పత్తిని లెక్కించటానికీ అవసరమవుతుంది. గుండె, కిడ్నీ, కాలేయ సమస్యలు గలవారు తరచూ నడుం చుట్టు కొలతను చూసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా డాక్టర్లు ఒంట్లో నీరు నిల్వ ఉండిపోతుండటాన్ని అంచనా వేస్తారు. శ్వాస సమస్యలు గలవారు ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ విస్తరించే కొలతను బట్టి ఊపిరితిత్తుల సామర్థ్యాన్నీ అంచనా వేస్తారు.

పల్స్‌ ఆక్సీమీటర్‌

కొవిడ్‌ విజృంభణతో ఉన్నట్టుండిది అత్యవసర పరికరంగా మారిపోయింది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులతో పాటు గుండె వేగమూ తెలుస్తుంది. ఆక్సిజన్‌ 95 కన్నా తగ్గటం ప్రమాదకరం. ఇలాంటివారు ఆయాసం లేకపోయినా ఆసుపత్రిలో చేరటం అత్యవసరం. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగట్టటానికి పల్స్‌ ఆక్సీమీటర్‌ తోడ్పడుతుంది. ఆక్సిజన్‌ 95 కన్నా ఎక్కువుంటే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు. అలాగే ఆరు నిమిషాల సేపు నడిచిన తర్వాత రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు పడిపోతుంటే కూడా అప్రమత్తం కావొచ్చు. ఇలా అత్యవసర పరిస్థితిని తెలుసుకోవటానికి వీలుండటం వల్ల దీంతో ఒక రకమైన ధైర్యం కూడా వస్తోంది. ఆస్థమా, సీవోపీడీ, ఎంఫెసీమా వంటి శ్వాస సమస్యలు.. అలాగే గుండె జబ్బులు గలవారికీ ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: సుఖీభవ: ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.