సోరియాసిస్ ఉన్నప్పుడు సరైన సమయానికి మందులు వేసుకోవడం సహా ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీన్ని అదుపులో ఉంచుకొనేందుకు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. సోరియాసిస్‌కు ఫలానా ఆహారాన్నే (Psoriasis Diet) తీసుకోవాలనే నిబంధన లేకపోయినా.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తమకు సోరియాసిస్ ఇబ్బందులను పెంచినట్లుగా బాధితులు చెప్పారు. దీనిని బట్టి ఈ జబ్బు ఉన్న వారు తప్పకుండా కొన్నిరకాల ఆహార పదార్థాలకు, పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.
తీసుకోవాల్సిన ఆహారం..
- మన శరీర కణాలకు మంచి చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విటమిన్ సీ, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, సెలీనియం వంటివి మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- చేపల్లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సైతం సోరియాసిస్‌కు మేలు చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. పళ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
- ఈ వ్యాధికి ముఖ్యంగా చెర్రీ, బెర్రీ పళ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
- మనం ఆహారంలో వాడే జీలకర్ర, అల్లంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవాలి.
- ఆలివ్ ఆయిల్, గింజలు, విత్తనాలకు సంబంధించిన ఆహారాలు కూడా మంచివి.
- కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వాపు గుణాన్ని పెంచుతాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
- స్వీట్లు తినడం మానేయాలి. బయట నుంచి తెప్పించుకునే పిజ్జా, బర్గర్లు ఇతర ఫాస్ట్‌పుడ్ అన్నింటిని పక్కన పెట్టాలి.
- బరువు ఎక్కువ ఉన్న వారిలో సోరియాసిస్ ఎక్కువ ఉంటుంది. అదే వారు తగ్గిన తరువాత వ్యాధి తగ్గడం కూడా పరిశోధకులు గమనించారు.
- తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. గ్లూటెన్ ఎక్కువగా ఉండే బార్లీ, గోధుమలు వంటివి తగ్గించాలి.
- సోరియాసిస్ ఉండి, ఆల్కాహాల్ అలవాటు ఉన్నవారు.. దానిని తగ్గించుకోవడం మంచిది. ఈ జబ్బు ఉండి మద్యపానం ఎక్కువగా తీసుకునే మగవారు చికిత్సకు సరిగా స్పందించడం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగే ఆల్కాహాల్ ఎక్కువగా తాగేవారు దానిని మానేసేటప్పుడు వారిలో సోరియాసిస్ ప్రభావం తగ్గుముఖం పట్టడం సైతం నిపుణులు గుర్తించారు.
- ఆహారంలో ఎలాంటి మార్పులు చేసినా.. వైద్యులను సంప్రదించాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వచ్చే ఇబ్బందులు..
- సోరియాసిస్‌తో కీళ్ల నొప్పులు కూడా వస్తాయి.
- గుండెపోటు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
- డయాబెటీస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బీపీ కూడా రావొచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇదీ చూడండి: healthy lifestyle: పోషకాహారంతోనే విజయం!