MRI Scan Effects: మనం బైక్ మీద నుంచి కిందపడిపోయినప్పుడో.. ప్రమాదాలు జరిగినప్పుడో.. ఒంటిలోపల దెబ్బలు తగిలాయో తెలుసుకునేందుకు స్కానింగ్ లాంటివి తీయాల్సి ఉంటుంది. కాళ్లు, తల, నడుం నొప్పులు, తిమ్మిర్లు.. ఎక్కువైనా స్కానింగ్ చేయించుకుంటే సమస్య తెలుస్తుందని వైద్యులు చెబుతుంటారు. స్కానింగ్‌లో చాలా రకాలే ఉంటాయి. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగ్‌లోని రేడియేషన్.. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చాలా మంది భయపడుతుంటారు.
అయితే.. దీనిపై మాట్లాడిన వైద్యులు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవని స్పష్టం చేస్తున్నారు. అది మూసి ఉన్న గదిలో నిర్వహించడం వల్ల ఓ ఫోబియాలా ఉంటుందని అంటున్నారు. స్టీల్, మెటల్ వస్తువులు శరీరంపై ఉంటే.. తీసేయమని మాత్రమే చెబుతారని వివరించారు ప్రముఖ న్యూరోసర్జన్ డా. వంశీ కృష్ణ.
''చేతులు, కాళ్ల తిమ్మిర్లు.. మెడలో నొప్పి.. నడుములో నరాల ఒత్తిడి, వణుకు వంటివి కామన్. దీనికి షుగర్ కూడా ఒక కారణం కావొచ్చు. కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటే సమస్య తెలుస్తుంది. చాలా మందికి ఎంఆర్ఐతో రేడియేషన్ ఉంటుందని భయం. ఉదాహరణకు తల స్కానింగ్ అప్పుడు.. ఎంఆర్ఐ మిషన్ లోపలకు వెళ్లాక సౌండ్‌కు భయపడుతుంటారు. దీనిని క్లోజ్డ్ ఫోబియా అంటారు. స్టీల్, మెటల్స్ ఒంటిపైన ఏమన్నా ఉంటే తీయాలి అంతే. ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. రేడియాలజీలో అడ్వాన్స్డ్ మెథడ్స్ ఓపెన్ ఎంఆర్ఐ, ఇంకా మ్యూజిక్ ప్లే చేస్తూ స్కానింగ్ తీయడం వంటివి ఉన్నాయి. అయినా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్యూచర్లో ఏదైనా సమస్య వస్తే.. పోల్చి చూసేందుకు ఈ ఎంఆర్ఐలు ఉపయోగపడతాయి.''
- డా. వంశీ కృష్ణ, న్యూరోసర్జన్
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వంటివి మెడికేషన్‌తో తగ్గిపోతాయని చెబుతున్నారు డా. వంశీ కృష్ణ. విటమిన్ బీ12 తక్కువున్నా ఇలాంటివి రావొచ్చని.. దానికి తగ్గట్లు మందులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఒకవేళ స్కానింగ్ తర్వాత కూడా మెడలో, నడుములో, శరీరంలోని ఏదైనా భాగంలో ఒత్తిడి ఉంటే.. మెడికేషన్ మేలని అంటున్నారు. వీటి వల్ల ఫలితం లేకుంటే.. ప్రత్యామ్నాయాలు ఉంటాయని సెలవిచ్చారు.
ఇవీ చూడండి: జుట్టు రాలుతోందని బాధ వద్దు! ఈ కొత్త ట్రీట్మెంట్తో..
వక్షోజాలు చిన్నగా ఉంటే ఇబ్బందా? పిల్లలకు పాలు సరిపోవా? డాక్టర్ జవాబులు ఇవీ..