Child Mobile Addiction Reduce Tips : ఇప్పుడు ప్రతిఒక్కరి ఇంట్లో టీవీ, అందరి చేతుల్లో సెల్‌ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో వినోదం కోసం టీవీ అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పెద్దవారు టీవీ చూడటం, సెల్‌ఫోన్లను వాడటం వల్ల పిల్లలు కూడా వాటికి అలవాటు పడిపోతున్నారు. అలాంటప్పుడు పిల్లలు టీవీ, సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా ఎలా కట్టడి చేయాలో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం సాంకేతికత అనేది బాగా పెరుగుతోంది. ప్రతిఒక్కరికి సాంకేతికం అందుబాటులోకి రావడం వల్ల అందరూ విపరీతంగా వినియోగించుకుంటున్నారు. చిన్న వయస్సుల్లోనే మొబైల్ ఎలా వాడాలనేది పిల్లలు నేర్చుకుంటున్నారు. దీంతో మొబైల్‌కు బానిసలుగా మారి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్‌తో పాటు టీవీ కూడా ఎక్కువగా చూస్తూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలు!
Reduce Mobile Addiction : ఇక చిన్నపిల్లలు గొడవ చేస్తున్నారని చాలామంది తల్లిదండ్రులు వారికి ఫోన్లు ఇస్తూ ఉంటారు. దీని వల్ల పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మెదడు సంబంధిత సమస్యలు, ఒత్తిడికి గురి కావడం, తలనొప్పి, ఆకలి మందగించడం, నిద్రలేమి సమస్య, సరిగ్గా చదవలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, చదివింది గుర్తు లేకపోవడం, కంటి సంబంధిత రోగాలు బారిన పడే అవకాశం ఉంది.
మొబైల్ సిగ్నల్ ద్వారా వచ్చే రేడియోధార్మికత వల్ల చిన్నపిల్లలకు మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే ఒకేచోట కూర్చోని టీవీ ఎక్కువసేపు చూస్తే ఏవో ఒకటి చిరు తిండ్లు తినడం వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడవచ్చు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారిని బుజ్జగించేందుకు సెల్‌ఫోన్ ఇవ్వడం, టీవీ చూపించడం లాంటివి తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. చివరికి చిన్న పిల్లలకు అవే అలవాటుగా మారిపోతాయి.
ఈ పిల్లలకు.. గంట మాత్రమే!
How To Reduce Mobile Usage : చిన్నపిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్ది సేపు మాత్రమే టీవీ ముందు ఉండేలా చూసుకోవాలి. 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఒక గంట మాత్రమే టీవీ చూసేందుకు అనుమతించాలి. అందులో ఒక అరగంట వారికి వినోదం కోసం కార్టూన్ ఛానళ్లు, మరో అరగంట విద్య, ఆర్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ లక్షణాలు పెంచే ఛానల్స్ చూపిస్తే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆ పిల్లలకు.. 2 గంటలు!
Mobile Addiction Reddit : 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లలు రెండు గంటల పాటు టీవీ చూసినా ఇబ్బంది ఉండదు. ఒక గంట వినోద కార్యక్రమాలు, మరో గంట విజ్ఞానం అందించే కార్యక్రమాలు చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోచింగ్, జనరల్ నాలెడ్జ్, న్యూస్ ప్రోగ్రామ్స్ చూపించాలంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇది జరగాలని చెబుతున్నారు.
క్రీడలపై దృష్టిని మళ్లించండి!
How To Reduce TV Addiction : పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ వాడటం వల్ల ఆందోళన, చికాకు, కోపం, కళ్లు తిరగడం, ఫోన్ నుంచి వచ్చే కాంతికి కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. దీంతో పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. పిల్లలకు ఫోన్లు వెంటనే ఇవ్వకూడదు. దానికి బదులు పిల్లలకు ఇష్టం ఉండే క్రీడలు ఆడించడం, మ్యూజిక్, డ్యాన్స్ లాంటివి నేర్పించడం, బుక్స్ చదివేలా ప్రోత్సహించడం లాంటి పనులు తల్లిదండ్రులు చేయాలి.