ETV Bharat / sukhibhava

Weight Loss Tips : అధిక బరువు సమస్యా? టైమ్​కు భోజనం చేయకపోతే ఇంకా నష్టం! - overweight disadvantages

Weight Loss Tips : అధిక బరువుతో బాధపడేవారు, బరువు తగ్గాలని అనుకునే వాళ్లు రకరకాల వ్యాయామాలు చేస్తారు. కఠోరమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. కానీ సరైన సమయంలో భోజనం చేయడం ద్వారా కూడా సులువుగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి ఆ సరైన సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

Weight Loss Routine
Weight Loss Tips
author img

By

Published : Aug 21, 2023, 7:47 AM IST

Weight Loss Tips : బరువు తగ్గాలి అనుకునే వారు.. వ్యాయామం చేయడంతో పాటు, పలు ఆహార నియమాలు పాటిస్తారు. ఏం తినాలి? ఎంత తినాలి? అని డైట్ ఛార్ట్ మెయింటెయిన్ చేస్తారు. కానీ ఎప్పుడు తినాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో చాలా మంది సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ చేయాలని చెబుతుంటారు. ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారని హెచ్చరిస్తారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

Over Weight Causes : సరైన ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు తినే సమయం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇటీవల indian.com అనే సంస్థ జసాన్ విజ్ అనే ఆరోగ్య నిపుణుడి ద్వారా 'అధిక బరువు సమస్య - నివారణ చర్యలు' అనే అంశాన్ని ప్రచురించింది. ఇందులో రాత్రి భోజనం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు జసాన్​. ఒక్కొక్కరికి ఒక్కో జీవన విధానం ఉంటుందని జసాన్ తెలిపారు. నిజంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలని.. అంతే తప్ప సరదా కోసం, ఊరికే దొరికింది కాదా అని తినేయడం చేయకూడదని ఆయన సూచించారు. డిన్నర్ చేయడానికి ఏది సరైన సమయమో తెలుసుకునేందుకు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాత్రి ఆలస్యంగా భోజనం ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం జీర్ణం కాకపోవడం
Poor Fat Digestion Effects : సాధారణంగా మనుషులకు సాయంత్రం అయ్యే సరికి ఆహార జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అసౌకర్యం లాంటి సమస్యలు ఏర్పడతాయి.

కడుపులో మంట
Acid Reflux Causes : ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన జీర్ణరసాలు పైకి ఎగబాకే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్యాస్ట్రో ఈసో ఫ్యాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ (GERD) వస్తుంది. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది.

నిద్రకు ఆటంకం
Causes For Disturbed Sleep : రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కొంత విరామం ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా నిద్ర పోవడానికి కాసేపు ముందు భోజనం చేస్తే.. శరీర విశ్రాంతికి ఆటంకం కలుగుతుంది. ఇది నిద్ర రాకపోవడానికి కారణం అవుతుంది.

Disrupted Sleep
రాత్రి నిద్రపట్టకపోవడం!

బరువు పెరుగుదల
Overweight Reasons : రాత్రి ఆలస్యంగా లేదా ఎక్కువగా భోజనం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రపోయేటప్పుడు శరీరం యాక్టివ్​గా ఉండదు. కనుక కేలరీస్ ఖర్చు కావు. ఇదే కాకుండా కొంత మంది రాత్రిపూట అనారోగ్యకరమైన స్నాక్స్ తింటారు. ఇది కూడా బరువు పెరుగుదలకు కారణం అవుతుంది.

Weight Loss Routine
ఊబకాయం సమస్య!

డయాబెటిస్ వచ్చే ప్రమాదం
Diabetes Risk : లేట్ నైట్ డిన్నర్ వల్ల శరీరంలో గ్లూకోజ్ శాతం కూడా పెరుగుతుంది. గ్లూకోస్ మెటాలిజంపై జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్​పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితులు టైప్-2 డయాబెటిస్​కు దారి తీస్తాయి.

హార్మోన్ల పైనా ప్రతికూల ప్రభావం
Impaired Glucose Metabolism : రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల హార్మోన్ లెవెల్స్​ పైన కూడా ప్రభావం పడుతుంది. ఇన్సులిన్​తోపాటు ఆకలి కలిగించే గ్రేలిన్ హార్మోన్ లెవెల్స్ అస్తవ్యస్తంగా మారుతాయి. ఈ పరిస్థితి ఓవర్ ఈటింగ్​కు దారితీస్తుంది. అతిగా తినడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.

Impaired Glucose Metabolism
రక్తంలో ఇన్సులిన్​​ స్థాయి పడిపోవడం!

ఆహారం ఎంపికలో జాగ్రత్తలు
Best Food Habits For Weight Loss : చాలా మంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు. అందులోనూ ఎక్కువ కేలరీలు ఉండే ఫుడ్ ఎంపిక చేసుకుంటారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల డైట్ అనేది బ్యాలెన్స్ తప్పుతుంది.

unhealty food
అనారోగ్యకరమైన జంక్​ ఫుడ్స్​!

గుండె పనితీరు పైనా ప్రభావం
Overweight Heart Disease : రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ పెరగడమే ఇందుకు కారణం.

heart problems
గుండె పనితీరుపై ప్రభావం!

భోజనానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కొంత వ్యవధి ఉండేలా చూసుకోవాలి.‌ రోజూ ఒకే సమయానికి భోజనం చేసేలా జాగ్రత్త పాటించాలి. తిన్న వెంటనే నిద్రపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ తమ జీర్ణవ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటూ సరైన డిన్నర్ సమయాన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే అధిక బరువు నియంత్రణలో ఉండి, మనం ఆరోగ్యంగా ఉంటాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.