పిల్లల ఎదుగుదలలో టీనేజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా 14-20 ఏళ్లు మధ్య పిల్లల్లో హైట్ పెరగడానికి (Weight Loss Tips) ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వయసు వారు అధిక బరువు ఉంటే అది వారి ఎదుగుదలతో పాటు ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదాహరణకు 14 ఏళ్ల వయసు వారు 45-50 మధ్య ఉండాలని అంతకుమించి ఉంటే (Weight Loss Tips) తరచూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను కూడా (Weight Loss Tips) మార్చుకోవాలని తెలిపారు. డీప్ ఫ్రై ఫుడ్స్, స్వీట్స్, చాక్లేట్స్ వంటివి పూర్తిగా మానేయాలని.. ఇవే బరువు పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ఈ తరహా అలవాట్లు ఉండటం వల్లే కొందరికి ఈ వయసుకే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తున్నాయని హెచ్చరించారు. తరచూ వ్యాయామం చేస్తూ సరైన డైట్ పాటిస్తే బరువు తగ్గడం సహా మంచి హైట్ పెరుగుతారని చెప్పుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : పిల్లలు బరువు తగ్గాలా? అయితే ఇవి పెట్టండి!