ETV Bharat / sukhibhava

బరువు తగ్గితేనే గుండెకు మేలు

author img

By

Published : Aug 14, 2021, 5:30 PM IST

గుండె జబ్బులతో బాధపడే ఊబకాయులు, మధుమేహంతో బాధపడేవారు బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరికి తాము అధిక బరువుతో ఉన్నామన్న సంగతే తెలియటం లేదని చెబుతున్నారు.

weight loss
అధిక బరువు

బరువు అదుపులో ఉంచుకోవటం ఎవరికైనా మంచిదే. గుండెజబ్బులతో బాధపడే ఊబకాయులకు, అధిక బరువు గలవారికైతే ఇది మరింత ముఖ్యం. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ మోతాదులు తగ్గేలా చూసుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. ఫలితంగా రెండోసారి గుండెపోటు బారినపడకుండా కాపాడుకోవచ్చు. అయితే గుండెజబ్బు బాధితులు, బరువు తగ్గటంపై అంతగా దృష్టి పెట్టటం లేదని ఐరోపా తాజా అధ్యయనం పేర్కొంటోంది.

20 శాతం కన్నా తక్కువే..

గుండెపోటు, గుండె రక్తనాళాల పూడికల వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో కేవలం 20% కన్నా తక్కువ మందిలోనే శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) మామూలుగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. అంటే 80% కన్నా ఎక్కువ మంది అధిక బరువు, ఊబకాయం గలవారే అన్నమాట. మరో 16 నెలల తర్వాత పరిశీలించగా ఊబకాయుల్లో 86% మంది ఇంకా ఊబకాయులుగానే ఉంటుండగా.. అధిక బరువు గలవారిలో 14% మంది ఊబకాయుల జాబితాలోకి చేరిపోయారు.

సగం మంది వారే..

చిన్నవయసు మహిళల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు సగం మంది 55 ఏళ్ల లోపు మహిళలే! మరో ముఖ్యమైన విషయం- మూడింట ఒకవంతు మంది ఊబకాయులకు శారీరక శ్రమ, ఆహారం గురించి ఎలాంటి జాగ్రత్తలు తెలియకపోవటం.

ప్రతి ఐదుగురిలో ఒకరికి తాము అధిక బరువుతో ఉన్నామనే సంగతే తెలియటం లేదు. ఊబకాయాన్ని తీవ్ర సమస్యగా పరిగణించటం లేదనటానికిదే నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, బరువు విషయంలో అలసత్వం పనికిరాదని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఇవి గమనించండి!

weight loss tips : బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

బరువు తగ్గాలా.. రోజుకు ఇన్ని ఖర్జూరాలు తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.