ETV Bharat / sukhibhava

గర్భధారణలో సమస్యా? పి.సి.ఓ.ఎస్ కావచ్చు!

భారత్​లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు పి.సి.ఒ.ఎస్‌ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ )తో బాధపడుతున్నారు. కౌమారదశలో పి.సి.ఒ.ఎస్ ఉన్న మహిళలకు.. జీవితంలో గర్భం ధరించలేకపోవటం, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అసలు పి.సి.ఓ.ఎస్ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఉందా?

PCOS
పి.సి.ఓ.ఎస్
author img

By

Published : Feb 2, 2021, 4:28 PM IST

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పి.సి.ఒ.ఎస్.. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఇది రుతుస్రావానికి సంబంధించినది. శరీరంలో పురుష హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్న కారణంగా రుతు చక్రం సక్రమంగా జరగదు. ద్రవంతో కూడిన తిత్తులు అండాశయాలలో ఏర్పడటం వల్ల స్త్రీ బీజాలను క్రమం తప్పకుండా విడుదల చేయలేదు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళల్లో పి.సి.ఓ.ఎస్ ఉన్నట్లు నిర్ధరిస్తారు. ఈ వ్యాధికి కారణాలు చెప్పలేము. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి సరైన చికిత్స అందించటం ద్వారా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు గురి కాకుండా కాపాడుకోవచ్చు.

పి.సి.ఓ.ఎస్ లక్షణాలు:

నేషనల్ హెల్త్ సర్వీస్ (బ్రిటన్) సూచించిన విధంగా..

  • అసాధారణ రుతు చక్రం లేదా ఎటువంటి రుతుస్రావం లేకపోవటం
  • అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల గర్భం ధరించలేకపోవటం
  • అవాంఛిత రోమాలు (ముఖం, ఛాతీ, వీపు మీద)
  • బరువు పెరగటం
  • తల మీద జుట్టు పలచపడటం, ఊడిపోవటం
  • జిడ్డు చర్మం, మొటిమలు

ఇవే కాకుండా అధిక రక్తస్రావం, శరీరంపై నల్లటి మచ్చలు, ముడతలు, తలనొప్పి, నడుము నొప్పి మొదలైన లక్షణాలు కూడా ఉండవచ్చు.

పి.సి.ఓ.ఎస్​కు కారణాలు:

పైన చెప్పినవిధంగా దీనికి కచ్చితమైన కారణం అంటూ లేదు. వంశపారంపర్యంగా కానీ, శరీరంలోని హార్మోన్లలో అసాధారణ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల కానీ ఇలా జరుగవచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీ, అధిక బరువు, ఊబకాయం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పి.సి.ఓ.ఎస్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు:

  • టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం)
  • గర్భధారణ సమయంలో మధుమేహం
  • అధిక రక్త పోటు
  • గర్భం ధరించలేకపోవడం
  • నిద్రలో ఊపిరి అందకపోవడం (స్లీప్ ఎప్నియా)
  • ఆందోళన, నిరాశ
  • ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు(ఈటింగ్ డిసార్డర్స్)
  • గర్భాశయ క్యాన్సర్
  • కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత
  • ఊబకాయం

పి.సి.ఓ.ఎస్​కు చికిత్స:

పి.సి.ఓ.ఎస్ లక్షణాలను నియంత్రణలో ఉంచడం తప్ప దీనికి కచ్చితమైన నివారణ చికిత్స లేదు. వైద్యులు మొదట వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుతూ, వారి దినచర్యకు శారీరక శ్రమను జోడిస్తారు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి. అధిక చక్కెర లేదా కొవ్వులు కలిగిన జంక్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. రోజూ కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే ఈ మార్పులు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి కాకుండా, గర్భం ధరించలేకపోవడం, జుట్టు రాలిపోవటం, రుతు చక్రంలో ఇబ్బందులు మొదలైనవాటిని అదుపులో ఉంచడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచడానికి సమర్థమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. సంతానోత్పత్తి మందులు ప్రభావవంతంగా పనిచేయకపోతే, లాప్రోస్కోపిక్, అండాశయ డ్రిల్లింగ్ అని పిలిచే శస్త్రచికిత్సా విధానాలను సిఫార్సు చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా అండాశయాలలో ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేసే కణజాలాన్ని లేజర్‌ సహాయంతో నాశనం చేసి టెస్టోస్టెరాన్ను నియంత్రించవచ్చు. అప్పుడు పి.సి.ఓ.ఎస్ ఉన్న మహిళలు గర్భం ధరించే అవకాశం ఉంటుంది.

అందువల్ల, పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే, ముఖ్యంగా క్రమరహిత రుతు చక్రాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. శారీరక పరీక్ష, ఉదరబాగ పరీక్ష, కటి అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు వంటి మార్గాల ద్వారా పి.సి.ఒ.ఎస్‌ను నిర్ధరించవచ్చు. పి.సి.ఓ.ఎస్ లక్షణాలు, సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి వైద్యులు తగిన మార్గాలను సూచిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.