ETV Bharat / sukhibhava

రుతుచక్రం గుట్టు విప్పుదాం..! - Mentrual problems

మహిళల్లో రుతుచక్రం సహజమైనది. యవ్వన దశలో ప్రారంభమై 50 సంవత్సరాలు దాటే వరకు ప్రతి నెల మహిళ శరీరంలో కలిగే లైంగిక మార్పులకు సంకేతం ఈ రుతుచక్రం. వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని, పెరుగుదలను అంచనా వేయడం కోసం రుతుచక్రంలోని దశలను అర్థం చేసుకుందాం.

Menstrual stages
రుతుచక్రం గుట్టు విప్పుదాం..!
author img

By

Published : Jun 14, 2021, 4:27 PM IST

మహిళ శారీరక పెరుగుదలలో రుతుచక్రం, అనగా ప్రతి మాసం బహిష్టు అవడం చాలా ముఖ్యమైన దశ. బహిష్టు అనగా నెలసరి రావటం. జననేంద్రియాల ద్వారా రక్త స్రావం కొద్దికాలం పాటు కలుగుతుంది. దీనికి కారణం హర్మోన్ల మధ్య సమతుల్యత.

నెలసరి అయినపుడు కలిగే మార్పుల గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. కానీ ఆ ఈ నెలసరి ఎందుకు కలుగుతుందో చాలా మందికి తెలియదు. దీనికి కారణం చాలా మంది మహిళలు ఈ విషయాల గురించి చర్చించకపోవటం. సామాజిక, మతపరమైన కారణాల వల్ల బహిరంగంగా ఈ అంశాల గురించి ఇతరులతో మాట్లాడరు. నేడు సమాజం పురోగమిస్తూ మహిళలు కూడా ఈ అంశాల గురించి మాట్లాడటానికి సంకోచించటం లేదు.

యవ్వన దశలోకి అడుగిడిన తరువాత బాలికల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు తయారవ్వడం ప్రారంభమవుతుంది. అండాశయాల నుంచి విడుదలయ్యే ఈ హార్మోన్ల ప్రభావంతో గర్భాశయంలోని గోడలు ప్రతి మాసం దళసరిగా అయ్యి తిరిగి సన్నబడతాయి. తద్వారా సహజ రక్తస్రావం పెరుగుతుంది. మెదడులోని పిట్యుటరీ గ్రంధి స్రవించే ఫాలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ వల్ల అండాశయంలోని స్త్రీ బీజాలు పరిపక్వత చెందుతాయి. అక్కడి నుంచే స్రవించే లూటినైజింగ్ హార్మోన్ అండాన్ని గర్భాశయంలోకి విడుదల చేస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ గర్భాశయంలోని లోపలి పొర పెరుగుదలకు కారణమవుతుంది. 3వ వారం నుంచి ప్రొజెస్టిరాన్ హార్మోన్ పిండానికి అవసరమైన పోషక పదార్ధాలను గర్భాశయ లోపలి పొరలో నిక్షిప్తం చేస్తుంది.

లైంగిక సంపర్కం లేని సందర్భంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయి గర్భాశయం లోపలి పొర విచ్ఛిన్నమై 3 రోజుల పాటు ఆర్తవ స్రావం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఈ 4 హార్మోన్లు మహిళలకు శారీరక, మానసిక లక్షణాలను కలగచేస్తాయి. రుతు చక్రాన్ని లెక్కించేటప్పుడు ఆర్తవ దర్శనం అయినప్పటి నుంచి తరువాత రుతుచక్రంలో మొదటిరోజు వరకు పరిగణించాలి. ఇది సుమారుగా 28 నుంచి 35 రోజుల వరకు ఉండవచ్చు. బాలిక 12 లేదా 13 సంవత్సరాల వయసులో ఉన్నపుడు ప్రారంభమవుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల ఆలస్యం కావచ్చు. ఆర్తవ స్రావం 3 నుంచి 5 రోజుల పాటు జరగవచ్చు. కొందరిలో 2 నుంచి 7 రోజుల పాటు ఉండవచ్చు. ఇలా 40 ఏళ్లు సాగిన తరువాత రుతుచక్రం ఆగిపోతుంది. దీనినే ముట్లుడుగటం అంటాం. ఇందులోని 4 దశలు.

  1. ఆర్తవ స్రావం: బాలిక 11 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్నపుడు అండాశయాలు (ఓవరీస్) స్త్రీ బీజాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. ప్రతి నెల ఒక పరిపక్వమైన స్త్రీ బీజం విడుదలవుతుంది. దీనికి పురుష బీజం కలవని పరిస్థితుల్లో గర్భాశయపు లోపలి గోడ (ఎండోమెట్రియం) విచ్ఛిన్నమై రక్తంతో పాటు యోని మార్గం ద్వారా బయటకు వస్తుంది.
  2. ఫాలిక్యులర్ ద: ఈ దశ రక్త స్రావం జరిగే మొదటిరోజు నుంచి గర్భాశయంలోకి అండం విడుదలయ్యే రోజు వరకు ఉంటుంది. ఈ దశలోను కొన్ని స్త్రీ బీజాలు పెరిగి అంతిమంగా ఒక స్త్రీ బీజం మాత్రం అండాశయం నుంచి విడుదలవుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు బీజాలు కూడా ఒకేసారి విడుదల కావచ్చు.
  3. ఓవ్యులేషన్ దశ: ఈ దశలో మహిళ గర్భాన్ని పొందే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. 14 లేదా 15వ రోజు పరిపక్వమైన స్త్రీ బీజం ఫెలోపియన్ గొట్టం ద్వారా గర్భాశయాన్ని చేరుతుంది. గర్భాశయంలో దీని ఆయుష్షు 24 గంటలు మాత్రమే. గర్భాశయానికి చేరిన పురుషుని శుక్రం దీనితో కలిస్తే గర్భం ఏర్పడుతుంది. అలా కలవని పక్షంలో స్త్రీ బీజం నిర్జీవంగా మారి స్రావాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
  4. ల్యూటియల్ దశ: బీజకోశం నుంచి బీజాణువు బయటకు వెళ్లిన తరువాత బీజకోశంలో దాని చుట్టూ ఉన్న పొర పరిమాణంలో పెరిగి ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ ఉత్తేజకాలను స్రవిస్తుంది. దీన్ని కార్పస్ ల్యూటియం అంటాం. ఈ ఉత్తేజకాల వల్ల గర్భాశయం లోపలి పొర మందం పెరుగుతుంది. గర్భం ఏర్పడిన తరువాత హ్యూమన్ కోరియోనిక్ గొనడో ట్రాపిన్ ఉత్తేజకాలను శరీరం స్రవిస్తుంది. వీటి వల్ల గర్భాశయపు లోపలి గోడ గర్భాన్ని పోషించడానికి సిద్ధం అవుతుంది. శిశు జననం తరువాత ప్రొజెస్టిరాన్ ఉత్తేజికం ప్రమాణంలో తగ్గుతూ గర్భాశయం మొదటి దశకు వస్తుంది. కొన్ని నెలల తరువాత యథావిధిగా ఆర్తవ చక్రం తిరిగి ప్రారంభమవుతుంది.

క్రమపద్ధతిలో లేని రుతుచక్రానికి కారణాలు:

  • గర్భం ఏర్పడటం
  • గర్భాశయంలో గడ్డలు లేదా అసాధారణ పెరుగుదల
  • పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీస్
  • గర్భనిరోధక ఔషధాలు వాడటం

సాధారణంగా కలిగే రుతు సమస్యలు:

బహిష్టు సమయంలో కనిపించే లక్షణాలు, సమస్యలు మహిళల్లో వేరువేరుగా ఉండవచ్చు.

  • కడుపునొప్పి, కడుపుబ్బరము, మంట, తలనొప్పి, అలసట, నడుమునొప్పి సాధారణంగా కనిపిస్తుంటాయి. బహిష్టు అయ్యే సమయానికి ముందు కనిపించే ఈ లక్షణాలను ప్రీ మెన్​స్ట్రుయల్ సిండ్రోమ్ అంటారు.
  • కొందరికి పొత్తికడుపులో నొప్పి, బిగుసుకు పోవటం కలుగుతుంది. దీనిని డిస్​మెనోరియా అంటారు.
  • కొందరికి బహిష్టు సమయంలో అధికంగా రక్త స్రావం జరుగుతుంది.
  • బహిష్టు స్రావం లేకపోతే అమెనోరియా అంటారు. గర్భం ధరించని దశలో, శిశువుకు పాలిస్తున్న సమయంలో ఇది సాధారణం. ఇతర సందర్భాల్లో రుతు స్రావం ఏర్పడకపోతే వైద్యున్ని సంప్రదించాలి.

ఇదీ చదవండి: తమలపాకులో దాగి ఉన్న 10 ఆరోగ్య రహస్యాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.