ETV Bharat / sukhibhava

జంక్ ఫుడ్స్ మానలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి!

కడుపు నిండుగా తిన్నా కొందరికి మళ్లీ ఏదైనా తినాలన్న కోరిక కలుగుతుంది. అయితే ముఖ్యంగా గర్భిణులకు తీపి, ఉప్పు, పుల్లటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలనిపిస్తుంది. వీటినే ఫుడ్ క్రేవింగ్స్ అంటారు. ఇలా అధికంగా తినడం వల్ల ఊబకాయంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ ఆహార కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

control junk food cravings
జంక్ ఫుడ్ క్రేవింగ్స్
author img

By

Published : Dec 17, 2022, 8:42 AM IST

కొంతమందికి కడుపు నిండుగా తిన్నా తీపి, ఉప్పు, పుల్లపుల్లటి ఆహార పదార్థాలను చూడగానే మళ్లీ తినాలన్న కోరిక కలుగుతుంది. వీటినే ఫుడ్‌ క్రేవింగ్స్ (ఆహార కోరికలు) అంటారు. ముఖ్యంగా గర్భిణులకు ఇవి ఎక్కువగా కలుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి పిజ్జా, బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌, ఐస్‌క్రీమ్స్‌ వంటి జంక్ ఫుడ్స్‌ను ఆశ్రయిస్తారు.

అదుపు చేసుకోండిలా!
సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు ఈ ఆహార కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి. అదేవిధంగా మూడ్‌ స్వింగ్స్‌, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా ఈ ఫుడ్‌ క్రేవింగ్స్‌కు కారణమవుతాయి. ఇలాంటి సమయాల్లో జంక్‌ఫుడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల శాతం పెరుగుతుంది. ఊబకాయం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ ఆహార కోరికలను అదుపులో ఉంచుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.

.

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి..
నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయి. అదేవిధంగా శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
ఎక్కువ గ్యాప్‌ ఇవ్వద్దు!
బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వద్దు. అదేవిధంగా తక్కువ మోతాదులో తిన్నా ఇతర ఆహార పదార్థాలపైకి మనసు మళ్లుతుంది. అందుకే మధ్య మధ్యలో కాస్త బాదం, వాల్‌నట్స్‌, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకుంటూ ఉండాలి.

.

బాగా నమిలి మింగండి!
ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో చూయింగ్‌ గమ్‌ కూడా సమర్థంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.

భోజనం మానద్దు!
చాలామంది వివిధ పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోతుంటారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పదార్థాలతో ఆకలిని తీర్చుకుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. సాధారణంగా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నప్పుడు శరీరం అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్స్‌నే కోరుకుంటుంది.

.

ప్రొటీన్లు బాగా తీసుకోవాలి!
కార్బొహైడ్రేట్లతో పోలిస్తే ప్రొటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రొటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇతర ఆహార పదార్థాల పైకి మనసు మళ్లదు.

ఒత్తిడిని దూరం చేసుకోండి!
భావోద్వేగాలు నియంత్రించుకోలేని వారు తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. సాధారణ సమయాల్లో కంటే ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఎక్కువగా తింటుంటారు. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా, మెడిటేషన్‌ను జీవనశైలిలో భాగం చేసుకోండి.

.

సరైన నిద్ర..
రాత్రి పూట తగిన నిద్రపోయే వారికి ఆహార కోరికలు తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారు జంక్‌ఫుడ్స్‌ను తీసుకోవడానికి తక్కువగా ఆసక్తి చూపుతారంటున్నారు. అందుకే రాత్రి పూట కంటి నిండా నిద్రపోండి.

వీటిని మాత్రమే స్టోర్‌ చేసుకోండి!
ఆహార కోరికలను అదుపులో ఉంచుకోవాలంటే జంక్‌ఫుడ్స్‌ను దూరంగా ఉంచాల్సిందే. ఇంట్లో చిప్స్, కుకీస్‌, ఐస్‌క్రీమ్స్ వంటివి స్టోర్‌ చేసుకోవడానికి బదులు బాదం, వాల్‌నట్స్.. మొదలైనవి ఎక్కువగా నిల్వ ఉంచుకోవాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.