పాపడ్ లడ్డూ వినడానికి కొత్తగా ఉన్నా రుచిలో మాత్రం అమోఘం. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా..?
కావలసినవి
వేయించిన అప్పడాలు: 12, పంచదార: పావుకప్పు, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: 5 టేబుల్‌స్పూన్లు, డ్రైనట్స్ (జీడిపప్పు, బాదం, పిస్తా వేయించి పొడిచేయాలి) పొడి: పావుకప్పు, అలంకరణకోసం: జీడిపప్పు
తయారుచేసే విధానం
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచాలి. వేయించిన అప్పడాలను మెత్తని పొడిలా చేయాలి. అవసరమైతే ఓసారి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. ఓ గిన్నెలో వేయించిన అప్పడాలపొడి, పంచదార, యాలకుల పొడి, డ్రైనట్స్ పొడి వేసి కలపాలి. జీడిపప్పు వేయించగా మిగిలిన నెయ్యిని పొడి మిశ్రమంలో వేసి లడ్డూల్లా చుట్టి జీడిపప్పుతో అలంకరించాలి.
ఇదీ చదవండి: నోరూరించే 'బ్రెడ్ స్క్రాంబుల్' చిటికెలో చేసుకుందామిలా..!