ETV Bharat / sukhibhava

భయ్యా.. రంగురంగుల చాయ్ విత్ ఆరోగ్యం! - tea recipes

మీరు ఇప్పటి వరకు ఎన్ని రంగుల చాయ్ రుచి చూశారు? అదేంటి, చాయ్ ముదురు గోదుమ రంగులో కాక ఇంకెన్ని రంగుల్లో ఉంటుంది అంటారా? ఉన్నాయండి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రంగుల టీలను మీకోసం పట్టుకొచ్చేశాం. రంగుతో పాటు ఆరోగ్యాన్ని పంచే స్పెషల్ చాయ్ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

try-healthy-and-most-famous-7-colored-special-chai-recipes
భయ్యా.. రంగురంగుల చాయ్ విత్ ఆరోగ్యం!
author img

By

Published : Aug 9, 2020, 6:50 PM IST

వర్షం పడుతుంటే కిటికీ దగ్గరో, బాల్కనీలోనో కూర్చుని చినుకుల సవ్వడిని ఆస్వాదిస్తూ... పొగలు కక్కే చాయ్‌ని తాగుతుంటే కలిగే ఆనందమే వేరు. మరి చాయ్‌ అంటే మనకి తెలిసింది టీ పొడి, పాలు, నీళ్లు, పంచదార, అల్లం, యాలకుల వంటివి వేసి చేసుకునేది. అంతకుమించి రుచీ, రంగూ ఉండే కొన్నిరకాల చాయ్‌ల్ని తాగితేనే కాదు... చూస్తే కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. ఇదిగో అలాంటి చాయ్‌ల కథాకమామీషు

try-healthy-and-most-famous-7-colored-special-chai-recipes
హరివిల్లు చాయ్‌

హరివిల్లు చాయ్‌

చాయ్‌ని ఇష్టంగా తాగుతూ సరికొత్త రుచుల్లో కోరుకునేవారికి ఈ సప్తవర్ణాల చాయ్‌ భలేగా విందు చేస్తుంది. ఎందుకంటే ఏడు రంగుల్లో కనిపించడంతోపాటు ఏ రంగుకా రుచి ఉండటం దీని ప్రత్యేకత. అంతేకాదు, ఈచాయ్‌ తాగినప్పుడు ఒక పొర చల్లగా పలకరిస్తే... ఇంకో పొర నాలుకని చురుక్కుమనిపిస్తుంది. కోల్‌కతాతోపాటు ఈశాన్య రాష్ట్రాలు, కోయంబత్తూరు ప్రాంతంలో ఈ టీ దొరుకుతుంది. రకరకాల చోట్ల పండే తేయాకు, స్పైసీ సిరప్‌లు, సుగంధద్రవ్యాలను వేసి చేసే ఈ చాయ్‌లో ఏడు రంగులూ, రుచీ రావడానికి ఏం చేస్తారు అనేది తయారీదారులకు మాత్రమే తెలిసిన రహస్యం. ఏదైతేనేం, ఈసారి ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ రెయిన్‌బో చాయ్‌ని ఆస్వాదించేయండి.

ఫెమినిస్ట్‌ చాయ్‌

ఫెమినిస్ట్‌ చాయ్‌

మామూలు రోజుల్లో ఏమో కానీ వర్షాకాలం, చలికాలంలో మాత్రం టీచుక్క కోసం నాలుక తెగ తపించిపోతుంది. అలాంటి వాళ్లు ఒక్కసారి కశ్మీరు ప్రత్యేకమైన ఫెమినిస్ట్‌ చాయ్‌ని తాగి చూశారో ఇక వదలరు. పేరుకు తగ్గట్టుగానే ఈ చాయ్‌ చూడముచ్చటైన గులాబీ రంగులో కనిపిస్తూ నోరూరిస్తూ ఉంటుంది. ఆ వర్ణంలో రావడానికి ఏ కృత్రిమ రంగో కలుపుతారనుకుంటే పొరబాటే. తయారీలో టీపొడితోపాటు బాదం, పిస్తా పలుకులు, దాల్చినచెక్క, గులాబీ రేకలు వేస్తారు. గులాబీ రంగుకోసం అక్కడ దొరికే ఓ ప్రత్యేకమైన ఉప్పును వాడతారు. నూన్‌ చాయ్‌ అని కూడా పిలిచే ఈ టీ తాగినవారు అద్భుతః అద్భుతస్యః అనాల్సిందే.

తందూరి చాయ్‌

తందూరి చాయ్‌

సుగంధద్రవ్యాల్నీ మట్టివాసన పరిమళాల్నీ కలగలిపి చేసేదే తందూరీ చాయ్‌. దీన్నే మట్కా చాయ్‌ అనీ పిలుస్తారు. అల్లం, శొంఠి, సుగంధద్రవ్యాలు, టీమసాలాలు, టీపొడి వేసి చిక్కని పాలతో కాస్తారు. తరవాత వేడి వేడి నిప్పులపైన కాల్చిన మట్టి కుండని ఇత్తడి పాత్రలో ఉంచి టీని అందులో పోస్తారు. కుండ వేడికి ఈ చాయ్‌ పొగలు కక్కుతూ బుసబుస పొంగుతూ ఇత్తడి పాత్రలోకి వస్తుంది. అలా వచ్చిన టీని మట్టి కప్పుల్లో ఇస్తారు. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే ఈ టీ వెనీలా, చాక్లెట్‌, లెమన్‌ వంటి ఫ్లేవర్లలోనూ దొరుకుతుంది. కేరళ ప్రాంతంలో ఈ టీలో నిమ్మగడ్డి, పుదీనా వంటివి వేస్తారు. కొన్ని చోట్ల కుంకుమ పువ్వు కలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో దొరికే ఈ చాయ్‌ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

సులేమాని చాయ్‌

సులేమాని చాయ్‌

మలబారు తీరంలో చేపల బిర్యానీకి తోడుగా సులేమాని చాయ్‌ ఉండాల్సిందే. పాలు లేకుండా తయారు చేసే ఈ టీని హైదరాబాద్‌లో గవా చాయ్‌ అని కూడా పిలుస్తారు.

నీళ్లలో మిరియాల పొడి, జాజికాయ, యాలకుల పొడి, లవంగాలూ, బెల్లం వేసి డికాక్షన్‌ తయారు చేస్తారు. తాగే ముందు కాస్త నిమ్మరసం కలుపుతారు. కొన్ని చోట్ల ఖర్జూర సిరప్‌ కూడా జత చేస్తారు. బెల్లం ఈ టీకి రుచినిస్తే... సుగంధద్రవ్యాలు కమ్మటి వాసనతో ఆకట్టుకుంటాయి. అరేబియన్‌ సంస్కృతిలో భాగమైన ఈ చాయ్‌ మన దగ్గర పాతబస్తీలోని బార్కస్‌, యూకత్‌పురా ప్రాంతాల్లో గ్లాసు పదిరూపాయలకే దొరుకుతుంది.

మసాలా మలై చాయ్‌

మసాలా మలై చాయ్‌

మలై అంటే కోవా. టీనీ కోవానీ కలగలిపి చేసేదే మసాలా మలై చాయ్‌. నీళ్లలో యాలకులు, అల్లం, టీపొడి వేయాలి. డికాక్షన్‌ చిక్కగా వచ్చాక అందులో బాగా మరిగించిన పాలు, కాస్త చక్కెర చేర్చాలి. టీ బాగా మరిగాక పొయ్యి మీద నుంచి దించి కోవా వేసిన కప్పులో పోసి తిరగబోస్తే తెల్లని నురగలతో కమ్మని మలై చాయ్‌ సిద్ధమైపోతుంది. కోవా ఉంటే ఈ నురగల చాయ్‌ని ఇంట్లోనూ ప్రయత్నించొచ్చు. పాలను మరిగించడంలోనే అసలు రుచి అనేది మర్చిపోకండి.

ఇదీ చదవండి: 'రాస్ బెర్రీ యాపిల్ క్వెంచర్' తాగితే ఆరోగ్యం సూపర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.