Tips To Reduce Pimples: అమ్మాయిలకు టీనేజ్‌లో మొటిమలు రావడం సర్వసాధారణమైన విషయం. శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో జరిగే మార్పులు కూడా వాటికి కారణం కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా మొటిమలు వస్తున్నాయి. మారుతున్న జీవనవిధానం, ఆహార అలవాట్లు, వాతావరణ పరిస్థితులే అందుకు కారణం. అయితే అమ్మాయిల విషయంలో ముందుగా మొటిమలను నివారించి, ఆ తర్వాత మచ్చలపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.
అందాన్ని తగ్గించే మొటిమలను తొలగించేందుకు రకరకాల లోషన్లు, క్రీములను అమ్మాయిలు వాడుతుంటారు. అయితే చర్మతత్వంతో సంబంధం లేకుండా క్రీములు, లోషన్లు వాడడం వల్ల వాటిలోని రసాయనాలతో తీవ్ర ప్రమాదముంది. అందుకే.. మొటిమలను సహజంగా తగ్గించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణులు చెప్పిన జాగ్రత్తలు.. చిట్కాలు..
- రోజూ అధిక మొత్తంలో నీరు తాగాలి.
- ముఖం జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడాలి.
- చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి
- పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసుకోవాలి.
- డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, చాక్లెట్స్ వంటి తీసుకోవడం తగ్గించాలి.
- రోజూ సమయానికి నిద్రపోవాలి.
- ముఖంపై చేతులు పెట్టి మొటిమలను గిల్లకూడదు.
- బరువు ఎక్కువగా ఉంటే కచ్చితంగా తగ్గడానికి ప్రయత్నించాలి.
- జంక్ ఫుడ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాలి.
- శరీరంలో ఎక్కువగా షుగర్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలను తగ్గించాలి.
- జిమ్‌కు ఎక్కువగా వెళ్లినా మొటిమలు పెరిగే అవకాశముంది.
"అయితే సహజంగా ఎన్ని చిట్కాలు పాటించినా మొటిమలు తగ్గకపోతే అందుకు తగ్గ వైద్యపరమైన ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సాధారణంగా ప్రాథమిక స్థాయిలోనే మొటిమలను అదుపు చేసుకోవాలి. లేకపోతే అవి నల్ల మచ్చల్లా మారే అవకాశముంది. రానురాను ముఖంపై గుంతల్లా కూడా ఏర్పడతాయి.. అప్పుడు వాటిని తగ్గించుకోవాలంటే లేజర్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. కొందరికి పాలు, పెరుగు అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువతాయి. అలాంటి వారు పాలు, పెరుగును కాస్త తగ్గించుకోవాలి. రుతుసంబంధిత సమస్యలున్నా మొటిమలు వచ్చే అవకాశముంది." అని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: నైట్ షిఫ్ట్ చేసే మగవారికి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!