ETV Bharat / sukhibhava

లాక్​డౌన్​ బద్దకాన్ని వదిలించుకోండిలా...

రెండు నెలలకుపైగా అందర్నీ ఇంటివద్దే ఉండేలా చేసింది మహమ్మారి కరోనా. దీని వల్ల పగలు నిద్రపోయే అలవాటు, బద్దకం మనకు తెలియకుండానే పెరిగిపోయాయి. ఈ దురలవాట్లను ఎలా దూరం చేయాలి? అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. అలాంటి వారు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Tips to keep awake during work
ఈ చిట్కాలతో మగత నిద్రను దూరం చేయండి!
author img

By

Published : Jun 2, 2020, 9:42 AM IST

కరోనా మహమ్మారి వల్ల ఇన్నిరోజులు అందరూ ఇంటి వద్దే ఉన్నారు. పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ ఎత్తివేస్తే పార్ట్​టైమ్, ఫుల్​టైమ్​, ఇంటి వద్ద నుంచి పని చేసేవారంతా విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు మండే ఎండలు. ఫలితంగా త్వరగా అలిసిపోవడం, పనిలో ఉన్నప్పుడు నిద్ర రావడం, బద్దకంగా అనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని దూరం చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

స్వచ్ఛమైన గాలి పీల్చాలి

శరీరానికి చురుకుదనం తీసుకురావడానికి ఉదయం లేదా సాయంత్రం ఎండలో నడవడం లేదా జాగింగ్​ చేయాలి. స్వచ్ఛమైన గాలిలో శ్వాస తీసుకోవాలి. చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి. ఒకవేళ మీరు లాక్​డౌన్​ ఆంక్షల్లో ఉంటే ఇంటి బాల్కనిలో గానీ, మేడపైగానీ జాగింగ్​ లేదా వ్యాయామం చేయాలి.

డీహైడ్రేషన్​ కాకుండా చూసుకోవాలి

డీహైడ్రేషన్​ వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి శరీరానికి తగినంతగా పోషకాలు అందించాలి. మన శరీరం 70శాతం నీటితోనే నిండి ఉంటుంది. అందువల్ల తగిన మోతాదులో నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

పనికి ముందు కాసేపు నిద్ర

పని చేసే ముందు కాసేపు నిద్రించడం వల్ల మనలో చురుకుదనం పెరుగుతుంది. కనీసం 15 నిమిషాలు కునుకు తీస్తే మంచిది. ప్రత్యేకంగా షిప్టుల విధానంలో పనిచేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

చిరు విరామాలు అవసరం

ప్రతి 45 నిమిషాలకు లేదా గంటకు ఒకసారి చిన్న విరామం తీసుకోవాలి. ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుంటే అలసట, ఒళ్లంతా నొప్పిగా అనిపిస్తుంది. లేచి కాసేపు కార్యాలయంలో అటూఇటూ తిరుగుతూ లేదా కదులుతూ ఉండాలి. మళ్లీ వచ్చి మీ పని మీరు చేసుకోవాలి.

వెలుగుల మధ్య..

పని ప్రదేశం కాంతివంతంగా ఉండడం ఎంతో కీలకం. మీ కెబిన్​లో కాంతి​ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. కాంతి తక్కువగా ఉంటే నిద్ర వస్తున్నట్లు ఉంటుంది. అలా కాకుండా కాంతి వచ్చేలా కిటికీలు తెరవడం మంచిది. ఒకవేళ రాత్రివేళ పని చేసినట్లయితే లైట్స్​ వేసుకోవాలి.

సంగీతం వింటూ...

కొంతమంది పని చేస్తున్నప్పుడు సంగీతం వింటూ ఏకాగ్రతను మెరుగుపరుచుకుంటారు. రాక్​ లేదా పాప్​ సంగీతం వింటే మనలో చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతుంది.

వేళకు నిద్ర

రాత్రి సమయంలో వేళకు నిద్రపోవడం అత్యంత కీలకం. రాత్రి వేళ ఎటువంటి చింత లేకుండా నిద్రిస్తే ప్రతిరోజు ఉదయం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే...

  • షెడ్యూల్ ప్రకారం నిద్రకు ఉపక్రమించాలి.
  • నిద్రించే ముందు ధూమపానం, మద్యపానం చేయకపోవడం మంచిది.
  • మీరు పడుకొనే వాతావరణం నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.
  • నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ లాంటివి తాగకపోవడం మంచిది.

లాక్​డౌన్​ మన నిత్యజీవితంలో కొన్నిమార్పులు తీసుకొచ్చింది. ఇందులో ఒకటి పగలు నిద్రించే అలవాటు. దీని నుంచి మళ్లడానికి కొంత సమయం పడుతుంది. అయితే మీకు నిద్ర వస్తున్నట్లు భావిస్తే కాఫీ, టీ తాగడం కంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: గుడ్డు, బ్రెడ్డు, మ్యాగీ.. ఎందులో ఎన్ని క్యాలరీలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.