ETV Bharat / sukhibhava

చర్మం పొడిబారుతోందా?.. చుండ్రు​ సమస్య వెంటాడుతోందా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

శీతాకాలంలో చర్మం పొడిబారటం, చుండ్రు​ వంటి సమస్యలు ఎక్కువగా వెంటాడుతుంటాయి. అయితే ఈ సమస్యలను నివారించేందుకు నిపుణులు కొన్ని సలహాలను, సూచనలను తెలిపారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Tips for dry skin and dandruff problems in winter
శీతాకాలంలో ఎదురయ్యే పొడిబారిన చర్మం, డేండ్రఫ్ సమస్యలు
author img

By

Published : Dec 19, 2022, 9:20 AM IST

శీతాకాలంలో చర్మ సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అధిక చలి కారణంగా చర్మం త్వరగా పొడిబారుతుంది. దీంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంది. దీంతోపాటు హెయిర్ కూడా డ్రైగా మారి చిట్లిపోతుంది. చుండ్రు సమస్య కూడా అధికంగా ఉంటుంది. అయితే చలికాలంలో పొడిబారిన చర్మానికి, డేండ్రఫ్​ సమస్యలను అధిగమించేందుకు నిపుణులు కొన్ని సలహాలను, సూచనలను అందించారు. అవేంటంటే..

స్కీన్​ కేర్ టిప్స్

  1. చలిగా ఉంది కదా అని ఎక్కువగా ఎండలో ఉండటం మంచిది కాదు. దీనివల్ల సన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
  2. వేడి, చల్లని నీటిని స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి.
  3. శీతాకాలం అని సన్​స్క్రీన్​ను వాడటం మానేయకూడదు.
  4. మాయిశ్చరైజర్ వాడటం మంచిది. ఫేస్​ వాష్​ చేసుకుని టవల్​తో తుడుచుకున్న తర్వాత చర్మం కొంత తేమగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్​ వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  5. చర్మానికి చలి, అధిక వేడి తగలకుండా కవర్​ చేసే దుస్తులను వాడటం మంచిది.
  6. చర్మంపై హార్ష్​గా ఉండే సోప్స్ వాడటం మంచిది కాదు. గ్లిసరిన్​ సబ్బులను వాడటం ఉత్తమం.
  7. స్కిన్​ ఎక్కువ డ్రైగా మారితే థిక్ మాయిశ్చరైజర్ వాడాలి.
  8. శరీరం డీ హైడ్రేట్ అవ్వటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. ఇలాంటి సందర్భాలలో జ్యూసేస్​ వంటి ద్రవ పదార్థాలను తాగటం మంచిది.
  9. శీతాకాలంలో సాల్సిలిక్ ఆమ్లం, గ్లైకాలిక్ యాసిడ్ లేని ఫేస్​వాష్​లను వాడటం మంచిది.
  10. ధూమపానం చేయటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. అయితే ఈ చెడు అలవాటు మానుకుంటే ఉత్తమం.
  11. అధిక ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి.
  12. నీటిని ఎక్కువగా తాగటం మంచిది.

హెయిర్​ కేర్ టిప్స్:
వింటర్​లో ఎదురయ్యే సమస్యలలో చుండ్రు​ ఒకటి. అయితే గోరువెచ్చని నీళ్లతో తలకి స్నానం చేస్తే మంచిది. అధిక గాఢత లేని మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాడటం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే సంబంధిత డాక్టర్​ను సంప్రదించటం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.