ఇంటి పనేగా అని చాలామంది చిన్నచూపు చూస్తారు. కానీ, శరీరంపై ఎక్కువ శ్రమ పడేలా చేస్తాయివి. కూర్చోవడం సహా ఒకే భంగిమలో ఏ పనైనా ఎక్కువసేపు చేయాల్సొస్తే మధ్యలో గుర్తుంచుకుని మరీ విరామం తీసుకోవాలి. వీలున్నప్పుడల్లా చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తుండాలి.
- గర్భం దాల్చడం, హార్మోనుల్లో మార్పులు అధిక బరువుకు కారణమవుతాయి. దీనిపై ముందు నుంచే దృష్టిపెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవన విధానాలతో బరువు తగ్గేలా చూసుకోవాలి.
- శరీరానికి తగినంత నీటిని అందించాలి. లేదంటే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దేహం తనకు అవసరమైన నీటిని కార్టిలేజెస్ నుంచి గ్రహిస్తుంటుంది. ఇదీ ఎముకలు అరిగిపోవడానికి కారణమవుతుంది. చక్కెరలతో నిండిన ద్రవపదార్థాలకు దూరంగా ఉండాలి.
ఇదీ చూడండి: AP-TS Water Dispute: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం