ETV Bharat / sukhibhava

'ప్రొటీన్ల'ను పట్టించుకోకపోతే ప్రమాదమే! - ప్రొటీన్​ సింథసిస్

కండలు పెరగాలని 'వే' ప్రొటీన్లు సేవిస్తున్నారా.. అయితే జాగ్రత్త! ఒక మోతాదుకు మించి ప్రొటీన్లు మన ఒంట్లో చేరితే.. అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే.. ఎవరెవరు ఎంతెంత పరిమాణంలో ప్రొటీన్లు తీసుకోవాలి? ఒకవేళ.. ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో? ఈ కథనంలో తెలుసుకుందాం.

Take Proteins with Caution
'ప్రొటీన్ల'ను పట్టించుకోకపోతే.. ప్రమాదమే!
author img

By

Published : Jan 3, 2021, 1:52 PM IST

కండలు పెంచాలనే ఉద్దేశంతో చాలా మంది జిమ్​లో జాయిన్​ అవుతుంటారు. ఆ ప్రయత్నంలో ఎగ్​ వైట్స్​, వే ప్రొటీన్​ పౌడర్లు, ప్రొటీన్ షేక్స్​ వంటివి విపరీతంగా తీసుకుంటారు. అయితే.. వాటి వల్ల స్వల్ప కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలే ఉన్నాయంటున్నారు డాక్టర్​ వందనా కకోద్కర్. ప్రొటీన్ల గురించి పలు కీలక విషయాలను 'ఈటీవీ భారత్​- సుఖీభవ'తో ఆమె పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రొటీన్లు.. రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి!

తగిన స్థాయిలో ప్రొటీన్లు.. శరీరానికి అందకుంటే.. జుట్టు, గోర్లు పెళుసుబారిపోవడం, గాయాలు మానకపోవడం, పెరుగుదల ఆగిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే ఎక్కువ స్థాయిలో ప్రొటీన్లు ఒంట్లోకి చేరితే... మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రొటీన్ల విషయంలో యువత జాగ్రత్తగా వ్యవహరించాలి.

మన కిడ్నీలు.. ప్రొటీన్​ సింథసిస్​ ప్రక్రియలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలకంగా తోడ్పడతాయి. అయితే.. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ప్రొటీన్లు శరీరంలోకి చేరితే కిడ్నీలపై అధిక పనిభారం పడుతుంది. ఫలితంగా.. మూత్రపిండాలు పాడవుతాయి.

ప్రొటీన్​ షేక్స్, వే ప్రొటీన్లు అతిగా సేవిస్తే ఏమవుతుంది?

పాలు, పెరుగు నుంచి తీసిన మీగడతో వే ప్రొటీన్లు తయారవుతాయి. సాధారణంగా క్రీడాకారులు.. వీటిని అధికంగా ఉపయోగిస్తారు. దీనివల్ల వారిలో శక్తి పెరిగుతుంది. కానీ, వీటివల్ల లాభాలెంత ఉన్నాయో నష్టాలు అంతే ఉన్నాయని తెలుస్తోంది. ఆహారానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్​ షేక్స్​ను ఎప్పుడూ భావించకూడదు. వ్యాయామాలు వంటివి చేసినప్పుడు కోల్పోయిన శక్తిని తిరిగి అందుకోవడానికి ప్రొటీన్​ షేక్స్​ను ఎక్కువగా తీసుకుంటారు. ఫిజిషియనన్​ను సంప్రదించిన తర్వాత మాత్రమే ఇలాంటివి వినియోగించాలి.

ప్రొటీన్లు ఎంత స్థాయిలో తీసుకోవాలి?

ఒక క్రీడాకారుడికి తన శరీర బరువులో కిలోకు 1.2 నుంచి 1.5 గ్రాముల ప్రొటీన్లు అందాలి. చాలా మంది జిమ్​ ట్రైనర్లు.. 2 గ్రాముల కంటే ఎక్కువ మోతాదు అందే ప్రొటీన్లను సేవించాలని సూచిస్తారు. ఇది మన శరీరానికి అత్యంత హానికారకం. అధికంగా ప్రోటీన్లను తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. చాలా మంది నీళ్లను తాగడాన్ని మానేస్తుంటారు. దానివల్ల మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది.

ఒక డైటీషియన్​గా సమతుల ఆహారాన్ని తీసుకోవాలని నేను సూచిస్తాను. ఒకే న్యూట్రియంట్​ అందేవి మాత్రమే మన ఆహారంలో భాగమైతే.. మిగతా న్యూట్రియంట్లు అందక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం ద్వారా మొత్తం అందే క్యాలరీల్లో ప్రొటీన్లు 15 శాతానికి మించకుండా చూసుకోవాలి.

-- వందనా కకోద్కర్, డైటీషియన్​​

ఇదీ చూడండి:రువు తగ్గాలా? వ్యాయామం అప్పుడే చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.