నడుంనొప్పి (Lower back pain) మిమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతోందా? అయితే.. కొన్ని ఆసనాలతో దానికి చెక్ (What causes lower back pain) పెట్టొచ్చు. ముఖ్యంగా మార్జాలాసనం గురించి చెప్పుకోవాలి.
నిశితంగా గమనిస్తే మనం పెంపుడు జంతువుల నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. మార్జాలాసనం (Marjariasana benefits) అలాంటిదే. శరీరాన్ని పిల్లిలా సాగదీసే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎలా చేయాలి?
ముందుగా వజ్రాసనం (Lower back pain exercises) వేసి కూర్చోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లు, అరచేతులు నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి సమాంతరంగా ఉండాలి.
నెమ్మదిగా శ్వాస వదులుతూ.. నడుమును వీలైనంత పైకి లేపాలి. తలను కొద్దిగా కిందికి దింపాలి. కాసేపు అలాగే ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. నడుమును (Strength exercises for lower back pain) కిందికి వంచుతూ, తలను పైకి ఎత్తాలి. కాసేపు అలాగే ఉండాలి.
- ఇలా ఐదారు సార్లు చేయాలి.
వీటన్నింటికీ చెక్..
- వెన్నెముక వదులవుతుంది.
- చురుకుదనం పెరుగుతుంది.
- నడుము నొప్పి(Lower back pain) తగ్గుతుంది.
- మణికట్టు, భుజాలు బలోపేతమవుతాయి.
- జీర్ణకోశ అవయవాలకు మర్దన లభిస్తుంది.
- జీర్ణక్రియ పుంజుకుంటుంది.
- కడుపు కండరాలు బిగువుగా అవుతాయి.
- కడుపులోని కొవ్వు తగ్గుతుంది.
- మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
- రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఇవీ చూడండి: శృంగారంలో పాల్గొంటే మొటిమలు తగ్గుతాయా?