ETV Bharat / sukhibhava

'థాయ్​ మసాజ్'​ పుట్టింది భారత్​లోనే! - thai massage bangkok

థాయ్​ మసాజ్​తో ఆరోగ్యమొక్కటే కాదు..అందమూ ఇనుమడిస్తుంది. మానసిక ఒత్తిళ్లు మాయమై మనసుకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అంతేకాదు పలు రోగాల బారి నుంచి రక్షణనిస్తుంది. ఒకటా...రెండా..ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి కాబట్టే థాయ్‌ల్యాండ్‌ వెళ్లిన వారు ఈ మసాజ్‌ చేయించుకోకుండా వెనక్కి రారు. ప్రపంచమంతా పేరున్న థాయ్​ మసాజ్​ను యునెస్కో సైతం గుర్తించింది. అయితే ఇంతలా ఆకట్టుకున్న థాయ్​ మసాజ్​ మూలాలు మన దేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా?

speciality-of-thai-massage-and-its-technique-history-lies-in-india
'థాయ్​ మసాజ్'​ పుట్టింది భారత్​లోనే!
author img

By

Published : Jul 14, 2020, 10:31 AM IST

బ్యాంకాక్‌ పేరు చెబితే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ‘థాయ్‌ మసాజ్’. సంప్రదాయ టెక్నిక్‌ను ఉపయోగించి శరీరంపై మర్దన చేయడం ద్వారా శారీరక, మానసిక సమస్యలను దూరం చేసే ఈ మసాజ్‌ అన్ని దేశాల్లోనూ విస్తరించి ప్రాచుర్యం పొందింది. అందుకే సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థాయ్‌ మసాజ్‌కు తాజాగా అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్‌ హెరిటేజ్‌ లిస్ట్‌) జాబితాలో థాయ్‌ మసాజ్‌ను చేర్చింది.

speciality-of-thai-massage-and-its-technique-history-lies-in-india
'థాయ్​ మసాజ్'​ పుట్టింది భారత్​లోనే!

మూలాలు భారత్‌లోనే..!

శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యల నుంచి సాంత్వన కలిగించే ఈ కళ మొదటగా మన ఇండియాలోనే పుట్టిందని చరిత్ర చెబుతోంది. సుమారు 2,500 ఏళ్ల క్రితం కొంత మంది డాక్టర్లు, రుషులు దీనిని థాయ్‌ల్యాండ్‌కు తీసుకువచ్చినట్లు అక్కడి స్థానికులు చెబుతారు. థాయ్‌ మసాజ్‌ను స్థానికంగా ‘ను ఆడ్‌ థాయి’ అని పిలుస్తారు. మసాజ్‌ చేయాలంటే నూనెను వాడడం సహజం. అయితే ఈ థాయ్‌ మసాజ్‌లో ఎలాంటి నూనెను ఉపయోగించకపోవడం విశేషం. శరీరంలోని కొన్ని ఆక్యుపంక్చర్‌ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని సాగుతుందీ మసాజ్‌. తరాలు మారుతున్నప్పటికీ ఓ ఆచారంగా పాటిస్తున్న ఈ సంప్రదాయ కళను భవిష్యత్‌ తరాలకు కూడా అందించాలని నిర్ణయించుకుంది యునెస్కో. ఈ క్రమంలో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దీనిని చేర్చుతున్నట్లు ప్రకటించింది.

145 దేశాల్లో ప్రాక్టీస్‌!

ఈ మసాజ్‌ మూలాలు భారత్‌లోనే ఉన్నా..సుమారు 2500 ఏళ్ల క్రితమే థాయ్‌ల్యాండ్‌కు చేరింది. అప్పట్లో థాయ్‌ రైతులందరూ ఆరోగ్యంలో భాగంగా ఈ మసాజ్‌ చేయించుకునేవారట. అక్కడ ప్రతి గ్రామంలో మసాజ్‌ చేసేవాళ్లు ఉండేవారట. పొలంలో పనిచేయడం వల్ల వచ్చే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వీరి దగ్గరకు వెళ్లేవారట రైతులు. అంతేకాదు అక్కడి దేవాలయాల్లోనూ గురువులు ఈ కళను శిష్యులకు నేర్పే వారని, అనంతరం వీరు వారి కుటుంబ సభ్యులకు కూడా నేర్పేవారని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. 19 వశతాబ్దంలో థాయ్‌ల్యాండ్‌ రాజు రామా-3 దీనికి సంబంధించిన మెలకువలను వాట్‌ ఫో టెంపుల్‌లోని రాళ్లపై చెక్కించాడు. 1962లో అక్కడే ప్రత్యేకంగా స్కూల్‌ ఏర్పాటయ్యాక ఎక్కువగా ఈ మసాజ్‌ టెక్నిక్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభమైందట. బ్యాంకాక్‌లోని వాట్‌ ఫో స్కూల్‌లో థాయ్‌ యువతతో పాటు వేల సంఖ్యలో విదేశీయులు ఈ మసాజ్‌పై శిక్షణ పొందుతున్నారు. శిక్షణ అనంతరం ఈ స్కూల్‌లో సర్టిఫికెట్‌ తీసుకుంటే ప్రపంచంలోని ఏ మసాజ్‌ సెంటరైనా, పార్లరైనా కళ్లు మూసుకుని ఉద్యోగం ఇస్తుంది. ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ స్కూల్‌లో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది శిక్షణ తీసుకుని, 145 దేశాల్లో మసాజ్‌ థెరపిస్టులుగా సేవలందిస్తున్నారు.

నొప్పుల నుంచి ఉపశమనం ..!

  • ప్రపంచంలోని చాలా దేశాల్లో స్పా పార్లర్లు, మసాజ్‌ సెంటర్‌లు ఉన్నా.. థాయ్‌ మసాజ్‌కున్న పాపులారిటీ, క్రేజ్‌ చాలా ప్రత్యేకం. అందుకు ఈ మసాజ్‌లో దాగున్న బోలెడన్ని ఆరోగ్య రహస్యాలే కారణం.
  • కేవలం చేతి వేళ్లు, మోచేతులు, మోకాళ్లు, పాదాలను ఉపయోగించి చేసే ఈ మర్దనతో శరీరం పూర్తిగా రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.
  • కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, తల నొప్పి, నిద్రలేమి, మానసిక ఆందోళనలు తదితర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ మసాజ్‌.
  • ఈ మసాజ్‌లో భాగంగా అటు శరీరానికి మర్దన అందడంతో పాటు అదే సమయంలో పలు యోగాసనాలు కూడా చేయిస్తారు. అందుకే దీనికి ‘థాయ్‌ యోగా మసాజ్‌’ అనే మరో పేరు కూడా ఉంది.
  • ఈ క్రమంలో మెడలు వంచడం, చేతులు వెనక్కి చాచడం, కాళ్లు మడుస్తూ-ముందుకు చాచడం, శరీర భాగాలన్నీ కదిలేలా పలు యోగాసనాలు చేయడం వంటివన్ని ఈ మసాజ్‌లో భాగమే. దీంతో శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఉద్రేకం, అలసట వంటివి తగ్గిపోతాయి.

ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే థాయ్‌ మసాజ్‌ కోసం చాలామంది బ్యాంకాక్‌కు పరుగులు తీస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లో ఏ వీధి చూసినా థాయ్‌ మసాజ్‌ సెంటర్లు, పార్లర్లే దర్శనమిస్తాయి. అక్కడ ఒక గంట పాటు మసాజ్‌ చేస్తే అయ్యే ఖర్చు కనీసం రూ.350. ఒక్క బ్యాంకాక్‌లోనే కాదు ఆ దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ మసాజ్‌ కారణంగా థాయ్‌లాండ్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాదు ఈ మసాజ్‌ సెంటర్ల ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లోనే కాకుండా ఇతర దేశాలకు ఈ మసాజ్‌ విస్తరించింది. దీని వల్ల కలిగే ఆరోగ్య, మానసిక ప్రయోజనాలే దీన్ని ఆయా దేశాల్లో పాపులర్‌గా మార్చాయని చెప్పుకోవచ్చు.

గర్భిణులకు చాలా ప్రమాదకరం!

బహుళ ప్రయోజనాలున్న ఈ థాయ్‌ మసాజ్‌ గర్భం ధరించిన మహిళలకు మాత్రం చాలా ప్రమాదకరం. ఈ క్రమంలో గర్భం ధరించిన ఓ 25 ఏళ్ల మహిళ ఇలాగే థాయ్‌ మసాజ్‌ చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమె తన గర్భం కోల్పోవడమే కాక కోమాలోకి వెళ్లిపోయింది కూడా. ఈ సంఘటన నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. ‘ గర్భిణులకు ఈ మసాజ్‌ చాలా ప్రమాదకరం. గర్భం ధరించిన మహిళలు మొదటి మూడు నెలల వరకు అసలు ఈ మసాజ్‌ చేయించుకోకూడదు. అదేవిధంగా ఆరునెలలు దాటిన వారు కూడా డాక్టర్ల సూచన మేరకే మసాజ్‌ చేయించుకోవాలి. మసాజ్‌ నిపుణుల సమక్షంలో అయితే మరీ మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవండీ 2000 ఏళ్ల క్రితం నాటి థాయ్‌ మసాజ్‌ చరిత్ర, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! మరి, మీరూ మీకు దగ్గరలోని మసాజ్‌ సెంటర్‌ను ఆశ్రయించి ఈ మసాజ్‌ చేయించుకోండి. తద్వారా అటు శారీరక, ఇటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

ఇదీ చదవండి: ఎంత తిన్నా.. బరువు పెరగొద్దంటే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.