![వానల్లో... గరంగరంగా!](https://assets.eenadu.net/article_img/2082020vasu5a.jpg)
కేసరి పాలు:
పాలల్లో బాదం, జీడిపప్పు పొడి, కుంకుమపువ్వు వంటివి వేసుకుని దీన్ని తయారుచేసుకోవచ్ఛు రుచిగా ఉండటమే కాదు శక్తినీ, ఆరోగ్యాన్నీ కూడా ఇస్తాయి ఈ పాలు.
తులసి పానీయం:
ఈ పానీయాన్ని తయారు చేయాలంటే కాసిన్ని నీళ్లు, తులసి ఆకులు, తేనె ఉంటే సరిపోతుంది. రెండు కప్పుల నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి తేనె కలిపి తీసుకుంటే బాగుంటుంది.
![వానల్లో... గరంగరంగా!](https://assets.eenadu.net/article_img/2082020vasu5b.jpg)
రైస్ బ్రాత్ సూప్:
బియ్యాన్ని వేయించి రవ్వలా మార్చి కాసిన్ని నీళ్లు పోసి మరిగించాలి. ఈ సూప్‌లో ఉడికించిన కాయగూర ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, బిర్యానీ ఆకులు కూడా వేయాలి. రుచి, పోషకాలూ అందే సూపు ఇది.