Snoring reasons and cure: మనం గాలి తీసుకునేటప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైనప్పుడు.. శ్వాసనాళాల్లో ఇబ్బందిగా మారినపుడు గురక వస్తుంది. నూటికి ముప్పై శాతం మందికి గురక సహజంగా ఉంటుంది. కానీ మోతాదుకు మించితే మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముక్కులోని టర్బనైట్స్, గొంతులో ఉండే ట్రాన్సిల్స్, అడినాయిడ్స్ లాంటి వాటి వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ముఖ్యంగా ఒబేసిటీ, కొవ్వు ఎక్కువగా ఉన్న వారిలో అధికంగా వస్తుంది.
పడుకునేటప్పుడు మెడ నరాలు రిలాక్స్ కావడం వల్ల కుడా వస్తుంది. వీటి వల్ల గాలి లోపలికి వెళ్లకపోవడం ఆక్సిజన్ స్థాయి తగ్గి.. కార్భన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. ఈ రెండు లక్షణాలు మన శరీరంపై దీర్ఘకాలికంగా అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. ఈ పరిస్థితినే స్లీప్ అప్నియా అంటారు.
దీనిని గుర్తించేందుకు అనేక రకాల పరీక్షలు ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ లాంటివి ఉపయోగించి దీని తీవ్రతను నిర్ధరించవచ్చు. తీవ్రతను బట్టి చికిత్స మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒబేసిటీ ఉన్న వారిలో గురక వస్తే బరువు తగ్గడం వల్ల నయం అవుతుంది. చిన్న వయసులో ఒబేసిటీ లేకుండా గురక వస్తే శరీరాన్ని పరీక్షించి.. శస్త్రచికిత్సతో నివారించవచ్చు. తక్కువ తీవ్రత గల వారిలో మందుల ద్వారా నయం చేయవచ్చు. స్లీప్ అప్నియాతో పాటు పలు రకాల పరీక్షలు చేసి వ్యాధి తీవ్రతను నిర్ధరించవచ్చు.
ఇవీ చదవండి: నచ్చింది తింటూనే బరువు తగ్గాలా? ఇలా చేయండి!