పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారి శ్వాసకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు. రకరకాల లక్షణాల ఆధారంగా ఈ సమస్యలను గుర్తించే వీలుంది. ప్రధానంగా సన్నటి గురక, ఊపిరి పీల్చడంలో కొద్దిపాటి విరామం, నిద్రాభంగం, పక్క తడపడం, దగ్గడం, నోటి ద్వారా గాలి పీల్చడం లాంటి లక్షణాలు కనిపిస్తే దానిని స్లీప్ ఆప్నియాగా (Sleep Apnea) గుర్తించాలి. చిన్నపిల్లల్లో వచ్చే స్లీప్ ఆప్నియా వలన పిల్లల ఎదుగుదల ప్రభావితం కావచ్చు. తొలిదశలోనే లక్షణాలను గుర్తించడం, వ్యాధి నిర్ధరణ, చికిత్స ప్రారంభించడం చాలా అవసరం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కారణాలు ఇవే..
- ప్రధానంగా డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్లకు ఈ సమస్య ఎదురుకావచ్చు.
- ముఖంలో కానీ, పుర్రెలో గానీ అసమానతలు, అసాధారణమైన మార్పులు ఉంటే స్లీప్ ఆప్నియా వస్తుంది.
- అధిక బరువు కూడా ఈ వ్యాధికి ఓ కారణం అవుతుంది.
- టాన్సిల్స్ ఉన్నవారిలో దీనిని ఎక్కువగా చూడవచ్చు.
- సెరిబ్రల్ పల్సీతో బాధపడుతున్నా, సికిల్ సెల్ వ్యాధి ఉన్నా, న్యూరో మస్క్యూలర్ వ్యాధి ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
- పుట్టుకతో తక్కువ బరువు ఉన్నా.. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు కూడా రావచ్చు.
- జలుబు ఎక్కువగా చేసే వారికి కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు.
- శరీరానికి సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.
స్లీప్ ఆప్నియాతో వచ్చే సమస్యలు..
- ఈ వ్యాధి చాలా తీవ్రమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవచ్చు.
- గుండె సంబంధమైన వ్యాధులు రావచ్చు.
- ఈ సమస్య ఉన్న పిల్లలు పగటి పూట చాలా డల్‌గా ఉంటారు. దేని మీద ఎక్కువ దృష్టి పెట్టలేరు. నేర్చుకోవడంలో వెనకబడిపోతారు.
- పెరగాల్సినంత బరువు పెరగరు. కొన్నిసార్లు హైపర్ యాక్టివ్‌గా తయారవుతారు.
నివారణ ఇలా..
- స్లీప్ ఆప్నియాకు కారణమైన అంశాలను పరిణలోకి తీసుకొని వైద్యులు పరీక్షలు చేస్తారు.
- టాన్సిల్స్ ఉంటే వాటిని తొలగించడం.
- శ్వాసకు ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- కాలుష్యం కలిగించే దుమ్ము ధూళి ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
- పిల్లలు ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి.
- ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలను ఇవ్వాలి.
- బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాలి.
ఇదీ చూడండి: Egg Protein: గుడ్డు ప్రతి రోజూ తినొచ్చా?