ETV Bharat / sukhibhava

వేసవిలో చర్మ సంరక్షణ.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!

వేసవి అంటేనే సమస్యల వలయం. ఈ కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్.. వంటి ఆరోగ్య సమస్యలే కాదు.. పలు చర్మ సంబంధిత సమస్యలూ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా ఈ సీజన్‌లో ఉండే సమస్యలు ఎన్నో..! వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఈ క్రమంలో పార్లర్ల చుట్టూ తిరగడం, తమకు తెలిసిన సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం.. ఇలాంటివీ అందులో కొన్ని. అయితే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని అధిగమించాలంటే ముందు వేడి నుంచి బయటపడాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం సౌకర్యవంతంగా, వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మాత్రమే కాదు.. సౌందర్య సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు.

skin care tips in summer
వేసవిలో చర్మ సంరక్షణ.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
author img

By

Published : Apr 3, 2021, 3:05 PM IST

స్నానానికి ముందు వద్దు..

చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృత కణాలు కూడా ఒకటి. వీటి వల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు.. వంటివి ఏర్పడతాయి. అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా వీటిని తొలగించుకోవడం అవసరం. అయితే చాలామంది స్నానానికి ముందే వీటిని తొలగించుకుంటుంటారు. కానీ దీనివల్ల చర్మంపై దురద రావడం, మేను పొడిబారిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాతే మృత కణాలను తొలగించుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆపై స్నానం చేసి.. మీ చర్మతత్వానికి సరిపోయే స్క్రబ్ సహాయంతో మృత కణాలను తొలగించుకోవాలి. ఫలితంగా చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.

makeupremovertipsgh650.jpg
స్నానానికి ముందు వద్దు..

తేమనందించడం ముఖ్యం..

అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం సహజమే. ఇందుకోసం వివిధ రకాల క్రీములు వాడడం, పదే పదే వ్యాక్సింగ్ ట్రీట్‌మెంట్లు చేయించుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే వీటివల్ల చర్మం ఇరిటేట్ అయి ఎరుపెక్కడం, దురద రావడం.. ఇలా పలు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. వీటిలోని గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవకుండా చేస్తుంది. అలాగే వ్యాక్సింగ్ చేయించుకునే వారు పదే పదే కాకుండా.. వ్యాక్సింగ్‌కి, వ్యాక్సింగ్‌కి మధ్య కనీసం పదిహేను రోజులైనా గ్యాప్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా షేవ్ చేసుకున్న వెంటనే పూల్స్, బీచ్‌లలోని నీటిలో ఈతకొట్టడం కూడా సరికాదు. దీనివల్ల ఆ నీటిలోని క్లోరిన్, ఉప్పు, సూర్యరశ్మి.. తదితర అంశాల వల్ల చర్మంపై ట్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 24 గంటల సమయమైనా గ్యాప్ తీసుకోవాలి.

vesavicharmasam650-2.jpg
తేమనందించడం ముఖ్యం..

చర్మం మెరుపు కోసం...

మనం తీసుకునే ఆహారం సైతం మేని మెరుపుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వేసవి కాలంలోనూ చర్మాన్ని తాజాగా మార్చుకోవడానికి, మెరిపించుకోవడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో విరివిగా లభించే మామిడి, బెర్రీస్.. వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. ఫలితంగా మచ్చలేని మెరిసే చర్మం మన సొంతమవుతుంది.

vesavicharmasam650-1.jpg
చర్మం మెరుపు కోసం...

ఇరవై నిమిషాల ముందు..

ఏ కాలమైనా బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అయితే దీని అవసరం వేసవి కాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటికి అడుగుపెట్టే ముందు కచ్చితంగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అది కూడా ఎస్‌పీఎఫ్ 30ని బయటికి వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే రాసుకోవాలి. అంతేకాదు.. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం తప్పనిసరి. ఫలితంగా చర్మానికి ఎలాంటి నష్టం కలగదు. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ రాసుకోవడమూ మర్చిపోవద్దు. అది కూడా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాలి.

vesavicharmasam650-3.jpg
ఇరవై నిమిషాల ముందు..

ఇదీ చూడండి: అద్భుతమైన వింత... మగ జాతి పిల్లల్ని కంటోంది...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.