ETV Bharat / sukhibhava

కూరగాయల్లో కల్తీ జరిగిందా?.. తెలుసుకోండి ఇలా! - విషపూరిత కూరగాయలు

కూరగాయలు ఆకుపచ్చగా కనిపించేందుకు విరివిగా రసాయనాలు వాడుతున్నారు కొందరు వ్యాపారులు. ఈ నేపథ్యంలో ఆహారం విషపూరితమై అనేకమంది రోగాల పాలవుతున్నారు. అయితే.. కల్తీ కూరగాయలు కనిపట్టేందుకు ఓ ట్రిక్​ షేర్​ చేసింది ఫుడ్​ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI).

vegtables
కూరగాయలు
author img

By

Published : Aug 30, 2021, 6:51 PM IST

పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, తాజాగా కనిపించేందుకు రసాయనాలు వాడుతున్నారు కొందరు వ్యాపారులు. ఆకుకూరలు కూడా పచ్చగా కనిపించడానికి కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తినే ఆహారం విషపూరితమవుతోంది. ఫలితంగా చాలా మంది తెలియకుండానే అనేక రోగాల బారిన పడుతున్నారు.

కొన్ని కూరగాయలు ఆకుపచ్చ రంగులో కనిపించేందుకు వ్యాపారులు మాలకైట్​ రసాయనాన్ని వాడుతున్నారని ఫుడ్​ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కూరగాయలు కల్తీ(adulterated vegetables) అయ్యాయా? లేదా? తెలుసుకునేందుకు ఓ వీడియో షేర్​ చేసింది ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ.

మాలకైట్ గ్రీన్​ అంటే?

మాలకైట్(malachite green)​ రసాయనాన్ని చేపలకు యాంటీ ప్రోటోజోవల్, యాంటీ ఫంగల్​ ఔషధంగా ఉపయోగిస్తారు. అక్వాకల్చర్​లో పారాసిటైడ్​గా, ఆహార, ఆరోగ్య, టెక్ట్స్​టైల్​ రంగాల్లోను ఈ రసాయనాన్ని మెండుగా ఉపయోగిస్తారు. వివిధ రకాలు చేపలు, ఇతర జీవులపై ఫంగల్ దాడులు, ప్రోటోజోవన్ ఇన్​ఫెక్షన్లను ఇది నివారిస్తుంది. అయితే.. మిర్చి, బఠానీలు, సహా పలు ఆకుకూరలు పచ్చగా కనిపించేందుకు ఈ రసాయనాన్ని వినియోగిస్తున్నారు కొందరు.

వివిధ రోగాలకు కారణం..

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్(NCBI) తెలిపిన ప్రకారం.. సమయం పెరిగినకొద్దీ, ఉష్ణోగ్రతను బట్టి మాలకైట్ విషపూరిమవుతుంది. కార్సినోజెనెసిస్, మ్యూటాజెనెసిస్, క్రోమోసోమల్ ఫ్రాక్చర్స్, టెరాటోజెనెసిటీ, శ్వాసకోస సమస్యలు ఇది కారణవుతుంది.

ఈ నేపథ్యంలో ఆకుపచ్చని కూరగాయలు విషపూరితమా? కాదా? తెలుసుకునేందుకు ఓ వీడియో షేర్ చేసింది ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ.

సింపుల్​గా టెస్టు చేయండిలా..

  • లిక్విడ్​ పారాఫిన్​లో ముంచిన కాటన్​ పీస్​ను తీసుకోవాలి.
  • బెండకాయ సన్నటి భాగంపై కాటన్​తో రుద్దాలి.
  • దూది రంగు మారకపోతే అవి కల్తీ కాలేదని అర్థం.
  • ఒకవేళ రంగు మారితే కూరగాయలు కల్తీ అయినట్లు పరిగణించాలి.

ఇదీ చదవండి:వెల్లుల్లి తింటే తగ్గే రోగాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.