ETV Bharat / sukhibhava

Semolina Health Benefits : బొంబాయి రవ్వతో.. బీపీ, షుగర్​ సహా​.. గుండె సమస్యలకు చెక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 8:03 AM IST

Semolina Health Benefits In Telugu : బొంబాయి రవ్వ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకుంటే శరీర బరువును తగ్గించుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే పూర్తి లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

health benefits of eating Semolina daily
Semolina Health Benefits

Semolina Health Benefits : అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బొంబాయి రవ్వ ఒకటి. ముఖ్యంగా ఇది శరీరం బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంటే బరువు పెరగకుండా కాపాడుతుంది. బొంబాయి రవ్వలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్- బి ఉంటాయి. ఇందులో శరీర బరువును తగ్గించేందుకు అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి. అదే సమయంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు.. తమ రోజువారీ భోజనంలో బొంబాయి రవ్వను తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

షుగర్​ నియంత్రణలో ఉంటుంది!
Semolina For Diabetes Patients : బొంబాయి రవ్వను తీసుకుంటే.. చాలా సమయంపాటు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే స్నాక్స్ సమయంలో బొంబాయి రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం త్వరగా చక్కెరగా మారకుండా బొంబాయి రవ్వ చూస్తుంది. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రతి రోజూ బొంబాయి రవ్వను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు పుష్కలం
Semolina Nutritional Value : బొంబాయి రవ్వలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ -బితో పాటు ఫోలేట్, నియాసిన్ కూడా ఉంటాయి. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, రక్తాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలోని అన్ని భాగాలు.. తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో తోడ్పడతాయి.

బరువు నియంత్రణ
Semolina For Weight Loss : బొంబాయి రవ్వలో ఉండే కార్బోహైడ్రేడ్ల వల్ల శరీరానికి నిరంతరం శక్తి అందుతుంది. దీన్ని తీసుకుంటే ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. ఆకలిని నియంత్రించడంతో పాటు, అతిగా తినకుండానూ బొంబాయి రవ్వ సాయపడుతుంది. అందువల్ల బరువును నియంత్రించాలని అనుకునేవారు కచ్చితంగా బొంబాయి రవ్వతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.

జీర్ణక్రియ మెరుగుదల
బొంబాయి రవ్వలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఫైబర్ వల్ల శరీరంలో జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీని వల్ల ఆకలి కలుగదు. మలబద్దకం రాకుండానూ ఫైబర్ నియంత్రిస్తుంది. అలాగే పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా పెరుగుదలలోనూ ఇది తోడ్పడుతుంది.

గుండె సమస్యలకు చెక్
Semolina For Heart Problem : బొంబాయి రవ్వలో కొవ్వు తక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. ఈ రవ్వలో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించి మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎముకల ఆరోగ్యం
Semolina For Bones And Joints : బొంబాయి రవ్వలో ఉండే ఫాస్పరస్ శరీరంలోని ఎముకలు, నోట్లోని పళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో దోహదపడుతుంది. ఈ రవ్వను తరచూ తీసుకుంటే ఎముకల సాంద్రతతో పాటు, మొత్తం ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.